
Astrology: మార్చి 12 నుంచి శుక్రుడు మరియు రాహు యతి జరగబోతోంది. శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. ఆ రోజు నుంచి శుక్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. రాహువుతో కలిసి ఉంటాడు. దీని వల్ల మూడు రాశులకు మంచి ఫలితాలు రానున్నాయి. మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు శక్రుడు, రాహువు కలయిక ఉంటుంది. ఏప్రిల్ 6 తరువా మేషరాశి వదిలి వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. అప్పుడు శుక్రుడు, రాహువు కలయిక ముగుస్తుంది. ఈ సమయంలో మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే అవుతోంది. తిరుపతి జ్యోతిష్య పండితుడు కృష్ణ కుమార్ భార్గవ మూడు రాశుల గురించి ఎన్నో విషయాలు వివరించారు.
మిథున రాశి వారికి..
దీని ప్రభావంతో మిథున రాశి వారికి మేలు కలుగుతోంది. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు కానుంది. వ్యాపారం చేసే వారికి బాగా కలిసొస్తుంది. వ్యాపారం వృద్ధి అవుతుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఆదాయం భారీగా వస్తుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులకు లాభాలు ఎక్కువగా వస్తాయి. శుక్రుడి వల్ల సుఖాలు కలుగుతాయి.
తుల రాశికి..
శుక్ర రాహువుల కలయికతో తుల రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. వివాహం ఆలస్యమయ్యే వారికి పెళ్లి జరుగుతుంది. వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానుగాలు బలపడతాయి. జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు సిద్ధిస్తాయి. చేసే పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ధనం బాగా వస్తుంది. దీంతో మనకు ఎంతో లాభాలు గడించవచ్చు.

మీన రాశి వారికి..
ఇక మీన రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. శుక్ర, రాహువుల కలయిక వల్ల వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మీరు ధనవంతులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగం బలపడుతుంది. సౌకర్యాలు సమకూరుతాయి. ఎక్కడో రాకుండా ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. సంతోషంతో కాలం గడుపుతారు. సంపద పెరుగుతుంది. ఫలితంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మీ మాటకు విలువ రెట్టింపవుతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇలా శుక్రుడు, రాహువు కలయిక వల్ల మిథునం, తుల, మీన రాశుల వారికి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి.