
Broom: మనం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇంట్లో ఉండాల్సిన వస్తువులు సరిగా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తాం. ఇంట్లో అమర్చుకోవాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు చూస్తుంటాం. ఇంట్లో ఉండే చీపురు విషయంలో కూడా పద్ధతులు పాటించాలి. లేకపోతే ఇంట్లో అనుకూల వాతావరణం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుంటాయి. గొడవలు జరుగుతాయి. ఇలా మన ఇంటిని వాస్తు ప్రకారం ఉంచుకునేందుకు మనం ఎన్నో పరిహారాలు పాటిస్తాం
ఎటు వైపు ఉంచుకోవాలి?
ఇంట్లో చీపురును ఎటు వైపు ఉంచుకోవాలి? వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ ఉంచుకోవాలి? చీపురును ఎప్పుడు కూడా ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఉంచకూడదు. నైరుతి, వాయువ్య దిశల్లో ఉంచుకోవడం మంచిది. చీపురు ఇంటి యజమానికి కనిపించకుండా ఉంచుకోవాలి. ఆగ్నేయంలో కూడా ఉంచుకోకూడదు. ఈ నేపథ్యంలో చీపురును ఉంచుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
చీపురు ఎప్పుడు కొనాలి?
చీపురును కొనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. శుక్లపక్షంలో కొనకూడదు. క్రష్ణ పక్షంలోనే కొనుక్కోవాలి. శుక్లపక్షంలో చీపురు కొంటే అనర్థాలే వస్తాయి. దీని వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. ఆ సమయంలో చీపురు కొనుగోలు చేస్తే ఊహించని కష్టాలు వస్తాయని అంటున్నారు.

ఏ వారాల్లో కొనుగోలు చేయాలి?
శుక్ర, మంగళవారాల్లో చీపురు కొనుగోలు చేయొద్దు. మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయడం ఏవిధంగానూ మంచిది కాదు. పొరపాటున కూడా ఆ రోజుల్లో చీపురు కొనకూడదు. ఒకవేళ కావాలని కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి. అందుకే చీపురు కొనుగోలు చేయడం కూడా అనువైన రోజుల్లోనే చేయాలి.