Kim Kardashian (1)
Kim Kardashian: గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి భారత కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించారు.
ముందస్తు పెళ్లి వేడుక తర్వాత.. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహం గత ఏడాది చివర్లో జరిగింది. ఆ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు.. రాజకీయ నాయకులు.. చాలామంది హాజరయ్యారు. అనంత్ – రాధిక వివాహం కోసం ముంబై నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంత్ – రాధిక వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధులు హాజరయ్యారు. అందులో హాలీవుడ్ నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ కూడా ఒకరు. అనంత్ అంబానీ వివాహంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన చూపులతో ఆకట్టుకున్నారు.. జస్టిన్ బీబర్ ఈ వివాహానికి హాజరై.. తనదైన పాటలతో హోరెత్తించారు. ఆయన పాడిన పాటలకు అతిథులు డ్యాన్సులు వేశారు. వాస్తవానికి కిమ్ కర్దాషియన్ మనదేశంలో వివాహ వేడుకకు హాజరు కావడం ఇదే తొలిసారి. ఆమె వివాహ వేడుకకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటి కిమ్ కర్దాషియాన్. వాస్తవానికి ఆమెతో ఒక లైవ్ కాన్సర్ట్ నిర్వహించాలనుకున్నప్పటికీ.. సమయాభావం వల్ల చేయలేకపోయారట. అయితే అనంత్ – రాధిక వివాహం జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. కిమ్ కర్దాషియన్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.
అంబానీలు అంటే ఎవరో తెలియదట
మనదేశంలో అంబానీ కుటుంబాలు అంటే తెలియని వారు ఉండరు. పైగా జియో తెరపైకి వచ్చిన తర్వాత అంబానీ కుటుంబం అంటే ప్రతి భారతీయుడికి తెలిసిపోయింది. మనదేశంలోనే కాకుండా.. విదేశాలలో కూడా అంబానీ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ధనవంతులు ఎనిమిదో వాడిగా ఉన్న ముఖేష్ అంబానీ గురించి కిమ్ కర్దాషియన్ కు తెలియదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది..” ముకేశ్ అంబానీ ఎవరు కూడా నాకు తెలియదు. ఆయనప్పటికీ వారి ఇంట్లో పెళ్ళికే నేను హాజరయ్యాను. నా ఫ్రెండ్, జ్యువెలరీ డిజైనర్ లారాయిన్ స్క్వార్జ్ కు ముకేశ్ అంబానీ కుటుంబంతో ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఆమె ద్వారా నాకు వారు ఆహ్వానం పంపించారు. ఆహ్వానానికి పంపించిన గిఫ్ట్ బాక్స్ బరువు దాదాపు 20 కిలోల వరకు ఉంది. అందులో ఖరీదైన బహుమతులు ఉన్నాయి. దీంతో నేను ఒక్కసారిగా టెంప్ట్ అయ్యాను. అందువల్లే ఆ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఇండియాలో ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు వివాహాన్ని ఘనంగా జరిపించారు. అక్కడ వంటకాలు నోరూరించాయి. అతిధులకు వారి వారి ఇష్టాలకు తగ్గట్టుగా వంటకాలు వడ్డించారు. ఖరీదైన బహుమతులు అందించారు. పెళ్లి జరిగిన రోజులు అక్కడ పండగ వాతావరణం ఉంది. వేలాదిమంది అతిరథ మహారధులు హాజరయ్యారు. పెళ్లి వేడుక కూడా అత్యంత ఘనంగా జరిగింది. అది చూసిన తర్వాత భలే ఆనందం అనిపించింది. భారతీయ సంస్కృతి కళ్ళముందు దర్శనమిచ్చింది. అటువంటి వివాహ వేడుకలో నేను కూడా ఒక భాగం అయినందుకు ఆనందిస్తున్నాను. మొత్తానికి ఆ వివాహ వేడుకకు హాజరై.. నా వంతుగా అనంత్ – రాధిక దంపతులను ఆశీర్వదించాను. వారికి నా ఆశీస్సులు అందించాను. కొత్తజంట చూడటానికి చాలా బాగుంది. ఆ స్థాయిలో పెళ్లి జరపాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాంటి ఖర్చు పెట్టడానికి ముకేశ్ అంబానీ వెనుకాడ లేదు. ముకేశ్ అంబానీ పెట్టిన ఖర్చు తన కుమారుడి పై ఉన్న ప్రేమను సూచిస్తోందని” కిమ్ కర్దాషియాన్ వ్యాఖ్యానించింది. అయితే పెళ్లికి వచ్చినందుకు కీమ్ కర్దాషియన్ కు అంబానీ కుటుంబం భారీగానే ముట్ట చెప్పిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వివాహం జరిగిన ఇన్ని రోజులకు కిమ్ కర్దాషియాన్ ముకేశ్ అంబానీ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.