Sukrithi Ambati marriage : కేరింత సినిమా యవతీయువకులను గిలిగింతలు పెట్టింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. కాలేజీ లవ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా అందరికీ కలకాలం గుర్తుండిపోతుంది. ఈ సినిమాతోనే సుమంత్, శ్రీదివ్య, సుకృతి, తేజస్విని మడివాడ లాంటి ఎంతో మంది తెరపైకి వచ్చారు.

ఈ సినిమాలో నటించిన ఐదుగురు కుర్రనటీనటుల్లో సుకృతి అంబటి ఒకరు. కేరింత సినిమాలో ‘భావన’ అనే పాత్రలో నటించిన ఈ క్యూట్ అమ్మాయి అందరికీ ఆ సినిమాతో గుర్తుండిపోతుంది. అయితే ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో ఈమె కనిపించలేదు. నూకరాజు ప్రేమించే భావనగా ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కేరింత తర్వాత మరే సినిమాలోనూ సుకృతి నటించలేదు.చదువు, కెరీర్ మీద దృష్టిపెట్టి సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాలకు దూరమైనా కూడా సుకృతి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. తన ఫాలోవర్స్ తో తన డైలీవారీ జీవితంలోని వాటిని పంచుకుంటోంది.
తాజాగా సుకృతి తన నిశ్చితార్థం ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ నిచ్చింది. సుకృతి అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని సుకృతి పెళ్లాడడానికి రెడీ అయ్యింది. తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.