Anushka- Prabhas: సోషల్ మీడియాలో తరుచూ చర్చల్లో ఉండే అంశాలలో ఒకటి ప్రభాస్ పెళ్లి.. ఆయన ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడో తెలియదు కానీ, యూట్యూబ్ చానెల్స్ , వెబ్ సైట్ రైటర్స్ ఆయనకి ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేసేసారు..ఎప్పటి నుండో ప్రభాస్ ప్రముఖ హీరోయిన్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం అవుతూనే ఉండేవి.. వాస్తవానికి నిజ జీవితంలో వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ఆ వార్త నిజమేనేమో అని ఫ్యాన్స్ కూడా నమ్మేశారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రభాస్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని.. వీళ్లిద్దరి నిశ్చితార్థం త్వరలోనే జరగబోతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.. బాలీవుడ్ మరియు టాలీవుడ్ మొత్తం ఈ వార్త తెగ వైరల్ గా మారిపోయింది.. అదేంటి అనుష్క తో డేటింగ్,త్వరలోనే పెళ్లి అన్నారు కదా..సడన్ గా ఈ ట్విస్ట్ ఏమిటి అని ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు..అయితే ఈ వార్తలపై కృతి సనన్ రియాక్ట్ అయ్యి అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.
అయితే ఇటీవలే ప్రభాస్ ఆహా మీడియా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2 ‘ షో లో ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఈమధ్యనే పూర్తి అయ్యింది..అందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి..ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయితే ఈ శుక్రవారం నుండే ఈ ఎపిసోడ్ ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు ‘అనుష్క తో డేటింగ్ చేస్తున్నావ్ అంటగా..పెళ్లి ఎప్పుడుమరీ’ అని ప్రభాస్ ని అడుగుతాడు అట.

అప్పుడు ప్రభాస్ ‘అదంతా ఫేక్ రూమర్స్ సార్..అనుష్క నాకు మంచి స్నేహితురాలు..నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది..మీకు ఈ షో అయిపోయాక ఆమె ఎవరో చెప్తాను లేండి’ అని అంటాడట ప్రభాస్..అంటే మొత్తానికి ప్రభాస్ పెళ్లి అయితే ఫిక్స్ అయిపోయింది..కానీ అది అనుష్క తో మాత్రం కాదు అనే క్లారిటీ మాత్రం అందరికి వచ్చేసింది..మరి ప్రభాస్ ని పెళ్లాడబోతున్న ఆ లక్కీ గర్ల్ ఎవరో చూడాలి.