Kerala Floods : కేరళ రాష్ట్రంలో వరదలు అపారమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా గత ఏడాది ఇదే ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ఇదే స్థాయిలో కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు విరిగిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఆ నష్టం నుంచి తేరుకోకముందే.. మళ్లీ అదే ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రక్రోపానికి వయనాడ్ కకావికలం అవుతోంది.
A landslide at the Kalladi tunnel work site in #Wayanad blocked the road and injured 5 people. They have been taken to the hospital. No deaths have been reported. Work at the site had already been stopped because of heavy rain. The area received 265 mm of rain in the last 24… pic.twitter.com/3LrpPhR0gM
— Ashish (@KP_Aashish) July 7, 2026
గత కొద్దిరోజులుగా కేరళ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు భారీగా నష్టాన్ని కలగజేస్తున్నాయి . వరద ప్రవాహం ముంచెత్తడంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొండ ప్రాంతాల నుంచి మట్టి దిబ్బలు కింద పడ్డాయి. రాళ్లు కొట్టుకొని వచ్చాయి. దారులు నామరూపాలు లేకుండా పోయాయి. వరద ప్రవాహం గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. శిధిలాల కింద 30 మంది చిక్కుకున్నారు.
వయనాడ్ లో భారీ వర్షాలు..
వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. శిధిలాల కింద చిక్కుకున్న పలువురు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..#Kerala #Vayanad pic.twitter.com/mnJ2mVSkvv
— Telugu Stride (@TeluguStride) July 7, 2026
అనక్కం పోయిల్, కల్లాడి సొరంగం ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిపోయాయి. కల్లాడి ప్రాంతంలో మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఒక్కసారిగా సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సునామి తరహాలోనే వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అప్పటికే ఆ ప్రాంతానికి ఎన్డీ ఆర్ఎఫ్ దళాలు చేరుకున్నాయి. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఈ ఇద్దరు చనిపోయారు. 30 మంది చిక్కుకున్నారు. వారందరినీ కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. కొన్ని సందర్భాలలో విపరీతంగా కురిసిన వర్షాలు ఈ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. విపరీతంగా నష్టం వాటిల్లడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఏకంగా జాతీయ విపత్తు కింద ప్రకటించింది. వయనాడ్ ప్రాంతంలో విపరీతంగా విలయం చోటు చేసుకోవడంతో.. ఆ ప్రాంతాన్ని బాగు చేయడానికి చాలా రోజులు పట్టింది. అది జరిగి ఏడాదికాకముందే మళ్లీ వర్షాలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తడం విశేషం.
