Homeట్రెండింగ్ న్యూస్Transgender Pregnancy: దేశంలోనే తొలిసారి..బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్‌ జెండర్‌.. ఎలా సాధ్యమైందంటే?

Transgender Pregnancy: దేశంలోనే తొలిసారి..బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్‌ జెండర్‌.. ఎలా సాధ్యమైందంటే?

Transgender Pregnancy: మాతృత్వం ప్రతీ స్త్రీకి గొప్ప వరం. దానికోసం ప్రతీ వివాహిత ఎదురు చూస్తుంది. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు పిల్లలే లేనివారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు మొక్కుతుంటారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారి ఓ వింత ఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు తల్లిదండ్రులు కాబోతున్నారు. గర్భం దాల్చిన ట్రాన్స్‌ జెండర్‌ జంట మార్చిలో బిడ్డకు స్వాగతం పలకనున్నారు. దేశంలోనే ఇది తొలిసారి కాబోతోంది.

Transgender Pregnancy
Transgender Pregnancy

ఆశ్చర్యపోయే ప్రకటన..
సాధారణంగా ట్రాన్స్‌ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మనకు తెలుసు. అందరం అదే భావిస్తాం. ఎవరి ఊహకు అందని విధంగా ట్రాన్స్‌ జెండర్ల జంట తాము కూడా తల్లిదండ్రులమవుతున్నామమని సంచలన ప్రకటన చేశారు. దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్‌ జెండర్‌ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా ట్రాన్స్‌ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వారు సరోగసి ద్వారానో లేదా ఎవరి వద్దనుంచి అయినా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారానో సంతానం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే అలా కాకుండా నేరుగా పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా మారి మరీ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది నమ్మశక్యంగా లేకున్నా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ లో నివసిస్తున్న ట్రాన్స్‌ జెండర్‌ జంట ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే తాము మాతృత్వాన్ని, పితృత్వాన్ని చవిచూడబోతున్నట్టు అతడిగా మారిన ఆమె ప్రకటించారు.

మార్చిలో బిడ్డ జననం..
మార్చిలో బిడ్డను లోకానికి పరిచయం చేయనున్న ట్రాన్స్‌ జెండర్‌ మహిళగా పుట్టి పురుషుడిగా మారిన జహాత్‌ , పురుషుడిగా పుట్టి మహిళగా.. జియా పావల్‌గా మారిన ఇద్దరూ మూడు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే వారు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. మార్చిలో తమ బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయబోతున్నామని, ఇందుకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫొటోలను నెటిజెన్లతో పంచుకున్నారు.

ఉద్వేగంగా ట్రాన్స్‌జెండర్‌ పోస్టు..
పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన జియా చేసిన పోస్టు ఉద్వేగభరితంగా ఉంది. ‘తాను, తన శరీరం పుట్టుకతో స్త్రీ కానప్పటికీ ఒక బిడ్డ తనను అమ్మ అని పిలుస్తుందని, ఒక బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవాలనేది తన కల’ అని పేర్కొన్నారు. ‘తాను తల్లి కావాలని ఏ విధంగా అయితే కలలు కంటున్నానో, జహాత్‌ కూడా తండ్రి కావాలని కలలు కంటున్నాడు’ అని తెలిపింది. తామిద్దరి సమ్మతితో తాను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించారు.

Transgender Pregnancy
Transgender Pregnancy

ఎలా సాధ్యమైందంటే..
అయితే స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ట్రాన్స్‌ జెండర్‌కు గర్భం ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ప్రశ్న. అయితే ట్రాన్స్‌ జెండర్‌గా మారిన సమయంలో చేయించుకున్న శస్త్ర చికిత్సలో అతని గర్భాశయాన్ని, మరికొన్ని అవయవాలను తొలగించకపోవడంతో ప్రస్తుతం అతను గర్భవతయ్యాడు. ఏది ఏమైనా సృష్టికి భిన్నంగా ట్రాన్స్‌ టెండర్లుగా మారిన వీరు తల్లిదండ్రులు కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా, తల్లిదండ్రులు కావాలనే వీరి తపనను నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. సంతోషంగా జీవించాలంటూ ఆశీర్వదిస్తున్నారు.

బిడ్డకు జన్మనిస్తే అతడిగా మారిన ఆమె.. అమ్మనా? నాన్ననా? అని నెటిజన్లలో కొత్త చర్చ కూడా జరుగుతుంది. ఆడ నుంచి మగగా మారిన ట్రాన్స్‌ జెండర్‌ గర్భం దాల్చి బిడ్డను కంటారు కాబట్టి తల్లి అవుతారా? లేకా పురుషుడిగా మారారు కాబట్టి కన్నప్పటికీ తండ్రే అవుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version