https://oktelugu.com/

Singer Vani Jairam Passed Away: బ్రేకింగ్ న్యూస్… సీనియర్ సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద మృతి, నుదుటిపై గాయం!

Singer Vani Jairam Passed Away: కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతి వార్త మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ గాయని వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. 1945 నవంబర్ 30న వెల్లూర్, తమినాడులో జన్మించారు. ఆమె ఎక్కువ ప్రాచుర్యం పొందించి మాత్రం తెలుగు పాటలతో. దాదాపు 5 దశాబ్దాల కెరీర్లో 10000 లకు పైగా పాటలు పాడారు. 18 భాషల్లో పాడారు. దేశంలోని ఉద్దండులైన సంగీత దర్శకులతో పని చేశారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 4, 2023 / 03:20 PM IST
    Follow us on

    Singer Vani Jairam Passed Away: కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతి వార్త మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ గాయని వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. 1945 నవంబర్ 30న వెల్లూర్, తమినాడులో జన్మించారు. ఆమె ఎక్కువ ప్రాచుర్యం పొందించి మాత్రం తెలుగు పాటలతో. దాదాపు 5 దశాబ్దాల కెరీర్లో 10000 లకు పైగా పాటలు పాడారు. 18 భాషల్లో పాడారు. దేశంలోని ఉద్దండులైన సంగీత దర్శకులతో పని చేశారు.

    Singer Vani Jairam Passed Away

    వాణిజయరాం మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. శంకరాభరణం మూవీ ఆమెకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో బాలసుబ్రమణ్యం తో పాటు వాణీ జయరాం పాటలు పాడారు. మూడు జాతీయ అవార్డ్స్ లో శంకరాభరణం చిత్రానికి ఒకటి ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమె సేవలకు గానూ  పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.

    చెన్నై నుంగంబాక్కంలో గల తన నివాసంలో వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె నుదుటి మీద గాయం ఉన్న నేపథ్యంలో మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో వాణీ జయరాం మరణానికి అసలు కారణం ఏమిటనే ఉత్కంఠ నెలకొంది. పి. సుశీల సౌత్ ఇండియాను ఏలుతున్న రోజుల్లో వాణీ జయరాం తన భిన్నమైన స్వరంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల అవార్డ్స్ అందుకున్నారు. ఒకసారి నంది అవార్డు సొంతం చేసుకున్నారు.

    Singer Vani Jairam Passed Away

    శంకరాభరణం మూవీతో వాణీజయరాం-విశ్వనాథ్ లకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ మూవీ విడుదలైన ఫిబ్రవరి 2న కే. విశ్వనాథ్ గారు మరణించారు. ఆయన కన్నుమూసిన రెండో రోజు వాణి జయరాం చనిపోయారు. దీన్ని యాదృచ్ఛికం అనుకోవాలా? దైవేచ్ఛ అనుకోవాలా? అని అభిమానులు వాపోతున్నారు. వాణీ జయరాం మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి  వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

    Tags