Kerala Lottery: ఇటీవల కాలంలో లాటరీ గెలిచిన కొద్ది మంది కోటీశ్వరులవుతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులు అవుతున్నారు. దీంతో లాటరీ టికెట్ల మీద అందరికి శ్రద్ధ పెరుగుతోంది. సులభంగా ధనవంతులు కావాలని కలలు కంటున్నారు. దీనికి దగ్గరయిన మార్గం లాటరీ కావడం గమనార్హం. గతంలో కేరళలో ఓ ఆటో డ్రైవర్ లాటరీ టికెట్ కొనుగోలు చేయడంతో అతడికి రూ. కోట్ల లాటరీ తగలడంతో అతడి అదృష్టమే మారిపోయింది. దుబాయ్ లో కూడా ఓ నేపాల్ దేశస్తుడు కొన్న లాటరీకి ఎంపిక కావడం తెలిసిందే. ఇలా లాటరీలతో తమ అదృష్టాలే మారుతున్నాయి.

దీనికి గాను మనం చేయాల్సిందల్లా లాటరీ టికెట్ కొనడమే. కొన్ని లాటరీలు నకిలీవిగా ఉండటంతో చాలా మంది కొనుగోలుచేయడానికి వెనుకాడుతున్నారు. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం లాటరీ వ్యవస్థను పటిష్టంగానే నడుపుతోంది. దీంతో చాలా మంది లాటరీ కొనడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇది ఎక్కడ కొనాలి? ఎవరు అమ్ముతారు? ఏ విధంగా కొనాలి అనే దానిపై స్పష్టత ఇస్తున్నారు. కేరళ ప్రభుత్వమే లాటరీ టికెట్లు అమ్ముతుండటంతో అందులో మోసాలేవీ లేవని చెబుతున్నారు.
కేరళ ప్రభుత్వం అందించే లాటరీ టికెట్లు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయాలి. మొదట కేరళ వాసులకు విలువ ఇస్తారు. తరువాత ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. దీంతో ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటే మనకు లాటరీ తగిలితే సమాచారం వస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం అందించే లాటరీల టికెట్లు కొనుగోలు చేస్తే మనకు నష్టం ఉండదు. అదృష్టం కలిసొస్తే మన ఇంటకి ధనలక్ష్మి రావచ్చు. మన దగ్గర ఉండే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా మాదిరి కేరళలో ప్రభుత్వమే లాటరీలు నిర్వహించడంతో అందులో మోసాలు లేవని చెబుతున్నారు.

లాటరీ టికెట్లు ప్రైజ్ మనీ ఆధారంగా ఉంటుంది. రూ. లక్షలకు ఒక రేటు, రూ. కోట్లకు మరో రేటు ఇలా పలు రకాల ధరలతో టికెట్లు విక్రయిస్తుంటారు. వాటిని కొనుగోలు చేయాలంటే ప్రైజ్ మనీకి అనుగుణంగా టికెట్లు ఉండటంతో మనకు ఏ ప్రైజ్ మనీ కావాలో నిర్ణయించుకుని కొనుగోలు చేసుకుంటే మంచిది. కోటీశ్వరులు కావాలంటే దగ్గర దారి లాటరీ అని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవారు తమ అభిరుచికి అనుగుణంగా టికెట్లు కొనుక్కుంటే మన తలరాత మారితే మనకు అదృష్టం వరించడం ఖాయమే.