Samantha: అది డిసెంబర్ 13, 2021.. సమంత, ఆమె మేనేజర్లు గచ్చిబౌలి లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ కి వచ్చారు. రకరకాల పరీక్షలు జరిగాయి. దీనికి తగ్గట్టుగానే రకరకాల వదంతులు మీడియాలో వ్యాపించాయి. కానీ కేవలం జలుబు, స్వల్ప జ్వర లక్షణాలు ఉండటంతోనే హాస్పిటల్ కి వచ్చామని సమంత మేనేజర్లు మీడియాకు చెప్పుకొచ్చారు. పరీక్షల తర్వాత కొన్ని నెలలపాటు ఆమె విశ్రాంతి తీసుకుంది. బయటకు చెప్పకపోయినా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని అందరికీ అర్థమైంది. ఆ వ్యాధి పేరే మయో సైటీస్. కొద్ది రోజుల క్రితమే గుర్తించామని ఆమె చెబుతోంది కానీ.. వాస్తవానికి ఆ వ్యాధి ఉన్నట్టు ఆమెకు ఏఐజి వైద్యులు అప్పుడే చెప్పారు. ఏఐజి వైద్యుల సూచన మేరకే ఆమె ముంబైలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మయాసైటిస్ కంటే ముందు ఆ వ్యాధి
మీకు గుర్తుందా.. 2015 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో సమంత డయాబెటిక్ పేషెంట్ గా నటించింది. వాస్తవానికి సమంతకు 2013లోనే డయాబెటిక్ వచ్చింది. అప్పటినుంచి ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటిస్తోంది.. అందు వల్లే డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు మయోసైటిస్ సోకింది. వాస్తవానికి ఈ రెండు వ్యాధులను తగ్గించే సదుపాయాలు ఈ అధునాతన వైద్యంలో ఉన్నాయి. కానీ పూర్తిగా నిర్మూలించే స్థాయిలో కాదు. మయోసైటిస్ అనేది దుర్మార్గమైన వ్యాధి. అరి కాళ్ల నుంచి మొదలుపెడితే పిరుదుల వరకు కండరాలు బాగా నొప్పి పెడతాయి. ఉన్నట్టు ఉండి మనిషి కుప్పకూలిపోతాడు. భరించలేని నొప్పి నరకం చూపిస్తుంది. జీవితాంతం మందులు వాడాల్సిందే. డయాబెటిక్ ను ఆమె దాచుకున్నా.. మయోసైటీస్ సోకిందని బహిరంగంగానే చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఆమెలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందుకు ఆమె ఇటీవల చేసిన ఒక ట్వీటే ఉదాహరణ. ” మీతో నాకు ఉన్న ఈ అనుబంధమే కఠిన సవాళ్ళను ఎదుర్కొనేందుకు కావలసినంత బలం ఇస్తోంది. నెలల క్రితమే నాకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ వ్యాధి నయమయ్యాక పూర్తి విషయాలు మీకు చెప్పాలని అనుకున్నా. కానీ నేను అనుకున్నంత సులభంగా ఈ వ్యాధి తగ్గే సూచనలు నాకు కనిపించడం లేదు. పరీక్షలు ఎదురైన ప్రతీసారీ బలంగా ముందుకు వెళ్లలేమనే సంగతి నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. త్వరలోనే ఇది నయం అవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మానసికంగా చూసుకున్నా, శారీరకంగా చూసుకున్నా మంచి, చెడులను ఈ రెండింటిని నేను చూశాను. ఇక నేను వీటిని భరించలేను అనుకున్న ప్రతిసారీ త్వరగానే వాటి నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు కూడా అంతే. కాకపోతే ఈ మయాసైటిస్ నాకు కఠిన పరీక్ష పెడుతోంది. దీనిని అధిగమించే ప్రయత్నంలో ఒకరోజు గడిచిపోయింది. లవ్యూ” అంటూ ఆమె ట్విటర్లో పేర్కొంది.

పూర్తిగా నివారణ సాధ్యం కాదు
ఇప్పుడు సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండవచ్చును గాక. డయాబెటిక్ లాగే మయోసైటిస్ కూడా దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి సోకితే నియంత్రించడం తప్ప నివారణ సాధ్యం కాదు. ఒక్కోసారి అనిపిస్తుంది తను అలాగే ఆ అక్కినేని కుటుంబంలో ఉండే ఉంటే గనుక మరింత సపోర్ట్ దొరికేదేమో! కానీ కొన్ని దూరం అయితే గానీ వాటి విలువ తెలియదు. సామ్ అంతకు ముందే సిద్దార్థ తో సమ్ థింగ్ నడిపింది. తర్వాత ఆ బ్రేక్ అయింది. కొన్నాళ్ళు ఎవరినీ తన దరిలోకి రానివ్వలేదు. కానీ అనుకోకుండా చై వచ్చాడు. బంధం చిక్కపడింది. పెళ్లి అయింది. తర్వాత విడాకులు అయ్యాయి. అన్నట్టు చిన్నప్పుడు సామ్ ను ఇంట్లో యశోద అని పిలిచేవారు. ఆ సినిమాలో ఆమె ఒక బాధితురాలుగా నటించింది. కొన్ని ఏళ్ల నుంచి తాను వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి అండగా ఉండేందుకు ప్రత్యూష అనే ఎన్ జీ వో ను నడుపుతోంది. ఇప్పుడు ఆమె ఒక బాధితురాలిగా మారింది. డెస్టినీ అంటే ఇదే కాబోలు.