
Kaushik Reddy: బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల్లో చాలామందికి నోటి దూల ఎక్కువ. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పోలీసులు, మహిళలు అనే తేడా లేకుండా అధికార మదంతో కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధూషిస్తున్నారు. ‘యథా రాజ.. తథా ప్రజ’ అన్నట్లు పార్టీ అధినేత ఇష్టానుసారం మాట్లాడుతుంటే.. ఆయన మెప్పుకోసం ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా నోటిదూల ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సే పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తాము గవర్నర్‌ను తిడితే సీఎం కేసీఆరం సంతోషపడతారని పేర్కొన్నారు. అది నిజమే అన్నట్లు గవర్నర్‌పై ఎమ్మెల్సీ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ మంత్రులు గానీ, మహిళా ప్రజాప్రతినిధులు గానీ, చిరవకు సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కానీ ఖండించలేదు. పరోక్షంగా సమర్థించినట్లుగా మౌనంగా ఉండిపోయారు.
మహిళా కమిషన్ రియాక్షన్..
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను అధికార పార్టీ సమర్థించినా.. జాతీయ మహిళా కమిషన్ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ప్రథమ మహిళపై ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణకు రావాలని కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని జాతీయ కమిషన్ కార్యాలయానికి ఫిబ్రవరి 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.
బిల్లులు ఆమోదించడం లేదని..
తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం లేదని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జనవరి 25న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గవర్నరును ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. దీనిపై అప్పుడే తీవ్ర విమర్శలొచ్చాయి. బీజేపీ నేతలు కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. కౌశిక్‌రెడ్డిలో కూడా కనీసం పశ్చాత్తాపం కనిపించలేదు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు.
సోషల్ మీడియాలో వైరల్.. సుమోటోగా విచారణ..
అయితే ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ వెనక్కి తీసుకోలేదు. దీంతో కౌశిక్‌రెడ్డి పదజాలం, గవర్నరు వంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న మహిళపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఈమేరకు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

తన ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరించారనేనా..
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని గవర్నర్‌కు ఫైల్ పంపించారు. అయితే ఆ ఫైల్‌ను గవర్నర్ చాలాకాలం పెండింగ్‌లో పెట్టారు. తర్వాత దానికి కారణం కూడా గవర్నర్ తెలిపారు. కౌషిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, సామాజికి సేవ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని స్పష్టం చేసింది. నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వంతోపాటు కౌశిక్‌రెడ్డి గవర్నర్‌పై కోపం పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల కౌశిక్‌రెడ్డి గవర్నరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. జాతీయ మహిళా కమిషన్ విచారణకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని తెలుస్తోంది.