https://oktelugu.com/

రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై కట్టప్ప హాట్ కామెంట్స్

ఒకరేమో సూపర్ స్టార్ రజినీకాంత్.. మరొకరు ఏమో తమిళ విలక్షణ నటుడు సత్యరాజ్.. ఇద్దరూ నటులే. కలిసి నటించారు. కానీ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం చేసేసరికి మాత్రం తేడా కొట్టింది. కట్టప్పగా బాహుబలిలో అలరించిన సత్యరాజ్ తాజాగా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై హాట్ కామెంట్స్ చేశారు. రజినీకాంత్ సాగదీసి దీసి మరీ రాజకీయ ప్రకటన చేయడం.. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే ఈ ప్రకటన చేయడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసేవ కంటే సీఎం కుర్చీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 09:30 AM IST
    Follow us on

    ఒకరేమో సూపర్ స్టార్ రజినీకాంత్.. మరొకరు ఏమో తమిళ విలక్షణ నటుడు సత్యరాజ్.. ఇద్దరూ నటులే. కలిసి నటించారు. కానీ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం చేసేసరికి మాత్రం తేడా కొట్టింది. కట్టప్పగా బాహుబలిలో అలరించిన సత్యరాజ్ తాజాగా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై హాట్ కామెంట్స్ చేశారు.

    రజినీకాంత్ సాగదీసి దీసి మరీ రాజకీయ ప్రకటన చేయడం.. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే ఈ ప్రకటన చేయడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసేవ కంటే సీఎం కుర్చీ కోసమే రజినీ ఇలా హడావుడిగా రాజకీయాల్లోకి వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    నటుడు సత్యరాజ్ తాజాగా రజినీకాంత్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎక్కడా రజినీకాంత్ పేరు వాడకుండానే విమర్శలు గుప్పించారు. సత్యరాజ్ మాట్లాడుతూ ‘రాజకీయాలు చేయాలంటే వేరే విషయాలు ఆలోచించకూడదు. నమ్మిన సిద్ధాంతంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. అంతేకానీ ప్లాన్ చేసుకొని.. లెక్కలు వేసుకొని రాజకీయాలు ఎవరైనా చేస్తారా? లెక్కలు వేసుకొని చేసేదాన్ని వ్యాపారం అంటరా? గుర్తు పెట్టుకోండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు తాను జనవరిలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు సత్యరాజ్ చేసిన కామెంట్లు తమిళ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.