
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 33,098 నమూనాలను పరీక్షించగా 517 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,73,858కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1474కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 862 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,64,600కి చేరింది.