https://oktelugu.com/

చంద్రబాబుకు చుక్కలేనా? స్టీఫెన్ ను దించుతున్న జగన్?

తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వార్తల్లోకి వచ్చారు. హైదరాబాద్ రెంజ్ ఐజీగా పనిచేసిన రవీంద్రను ఏపీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నారు. ఇటు కేసీఆర్ సర్కార్ కూడా నిజాయితీ గల అఫీసర్స్ రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నారు. ఈ స్టీఫెన్ రవీంద్రతోనే ఏపీ సీఏం చంద్రబాబునాయుడి ఆట కట్టించాడు కేసీఆర్. అప్పట్లో కలకలం రేపిన డేటా చోరీ కేసును డీల్ చేసింది […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 09:48 AM IST
    Follow us on

    తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వార్తల్లోకి వచ్చారు. హైదరాబాద్ రెంజ్ ఐజీగా పనిచేసిన రవీంద్రను ఏపీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నారు. ఇటు కేసీఆర్ సర్కార్ కూడా నిజాయితీ గల అఫీసర్స్ రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నారు. ఈ స్టీఫెన్ రవీంద్రతోనే ఏపీ సీఏం చంద్రబాబునాయుడి ఆట కట్టించాడు కేసీఆర్. అప్పట్లో కలకలం రేపిన డేటా చోరీ కేసును డీల్ చేసింది స్టీఫెన్ రవీంద్రనే. ఆ సమయంలో చంద్రబాబును స్టీఫెన్ రవీంద్ర ముప్పు తిప్పులు పెట్టారు. ఈ కేసును తవ్వి తీయడమే కాకుండా డేటా చోరీకి ఎలా పాల్పడ్డారో ఆయన అధారాలతో నిరుపించి కోర్టులో నివేదిక ఇచ్చారు.

    ఎన్నికల తరువాత ఆ కేసు పక్కకు వెళ్లిపోయింది అయితే అది వేరే విషయం.. జగన్ సీఏం అయ్యాక ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర ను నియమించాలని భావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పడు రవీంద్ర చీఫ్ సెక్యూరిటీ అఫీసర్ గా పనిచేశారు. అందుకే స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని జగన్ భావించాడు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించిన జగన్.. స్టీఫెన్ రవీంద్రను తమకు ఇవ్వాలని అభ్యర్థించారు.

    ఇందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో సెలవు పెట్టిన రవీంద్ర ఏపీకి వచ్చి కొన్నాళ్లపాటు అనధికారికంగా పనిచేశారు. ఆయనను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు.

    రవీంద్ర వరంగల్ జిల్లా ఎస్పీగా నక్సలిజాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు ఫాక్షనిజాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కరీంనగర్ ఎస్పీగా అవినీతిపై పోరాడి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ వాదం కూడా ఎదుర్కొన్నారు. ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తన విధి నిర్వహించిన దాఖాలాలు ఉన్నాయి.

    తాజాగా, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. స్టీఫెన్ రవీంద్ర విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జగన్ అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఆయనను రాష్ట్రానికి పంపాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడం ఖాయమేనని తెలుస్తోంది.

    చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీతోనే జగన్ గుట్టుమట్లు తెలుసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబుపై అదే ప్లాన్ ను జగన్ అమలు చేయబోతున్నాడని.. అందుకే తనకు నమ్మకస్తుడైన స్టిక్ట్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్రను జగన్ ఏరికోరి తెచ్చుకుంటున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.