https://oktelugu.com/

Kartika Deepam serial: సినిమాగా తెరకెక్కబోతున్న కార్తీక దీపం సీరియల్.. వంటలక్క అభిమానులకు ఇక పండగే

Kartika Deepam serial: మన ఆడియన్స్ కి కేవలం సినిమాలు , క్రికెట్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాదు. సీరియల్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పొచ్చు. కొన్ని సీరియల్స్ ని అయితే వయస్సుతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అలాంటి సీరియల్స్ లో ఒక్కటే కార్తీక దీపం. టీవీ సీరియల్స్ లో బాహుబలి రేంజ్ అని చెప్పుకునే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ సీరియల్ కి వచ్చే TRP […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2022 / 12:21 PM IST
    Follow us on

    Kartika Deepam serial: మన ఆడియన్స్ కి కేవలం సినిమాలు , క్రికెట్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాదు. సీరియల్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పొచ్చు. కొన్ని సీరియల్స్ ని అయితే వయస్సుతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అలాంటి సీరియల్స్ లో ఒక్కటే కార్తీక దీపం. టీవీ సీరియల్స్ లో బాహుబలి రేంజ్ అని చెప్పుకునే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ సీరియల్ కి వచ్చే TRP రేటింగ్స్ లో సగం కూడా ఇతర సీరియల్స్ కి రాదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. వంటలక్క, డాక్టర్ బాబు మరియు మౌనిత వంటి పేర్లు ఇంటర్నెట్ లో కూడా బాగా పాపులర్. అయితే వీళ్ళ పాత్రలు సీరియల్ లో ముగియడం తో అభిమానులు నిరాశకి గురైయ్యారు.

    Kartika Deepam serial

    Also Read: How to Win Her Heart With Words: మగువల మనసు గెలుచుకోవాలంటే ఏ మాటలు వాడాలో తెలుసా?

    అందువల్ల ఈ సీరియల్ కి రోజు వచ్చే TRP రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబు రీ ఎంట్రీ ఇవ్వడం తో ఈ సీరియల్ అభిమానులు మళ్ళీ ఈ సీరియల్ ని చూడడం మొదలు పెట్టారు..మొన్న వంటలక్క రీ ఎంట్రీ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి TRP రేటింగ్స్ వచ్చాయట. బుల్లితెర మీద ఈ రేంజ్ ప్రభంజనం సృష్టించిన ఈ సీరియల్ ని అతి త్వరలోనే ఒక సినిమాగా తియ్యబోతున్నారట దర్శక నిర్మాతలు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లేటెస్ట్ సినిమాలను అప్లోడ్ చేసే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. సీరియల్ లో నటించిన నటీనటులే సినిమాలో కూడా నటిస్తారట. కాకపోతే కొంతమంది కొత్తవాళ్లు కూడా యాడ్ అవుతారు.

    Kartika Deepam serial

    Also Read: Brahmaji: సామ్ చైతూ విడాకులు… 250 కోట్ల భరణమా సిగ్గూ శరం లేదంటూ మండిపడ్డ బ్రహ్మాజీ!

    5 సంవత్సరాల నుండి విరామం లేకుండా ప్రసారం అవుతున్న ఒక సీరియల్ కథని రెండున్నర గంటల సినిమాగా చూపించడం అంటే సాహసమే మరి, డైరెక్టర్ ఈ సినిమా కథ, కథనం ఎలా రాసుకున్నాడు అనేది చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుందా, లేదా నెట్ ఫ్లిక్స్ లోనే నేరుగా విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సీరియల్ వెర్షన్ లాగ సినిమా వెర్షన్ కూడా అదే రేంజ్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.