https://oktelugu.com/

Samantha: ఇండియాలో నెంబర్ వన్ హీరయిన్ గా సమంత.. షాక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్.. సామ్ అసలు ఎందుకు నంబర్ వన్ అంటే ?

Samantha: అదృష్టం అన్నివేళలా కాపాడదు. అదృష్టానికి టాలెంట్, హార్డ్ వర్క్ కూడా తోడైనప్పుడు లాంగ్ టర్మ్ కెరీర్ సాధ్యమవుతుంది. సమంత కెరీర్ ను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. నిజానికి పరిశ్రమలో సమంతకు లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ ఉంది. కానీ.. ఆమె లక్కీ హీరోయిన్ కాదు, లకే వెతుక్కున్న క్రేజీ హీరోయిన్. సామ్ కేవలం తన కష్టంతోనే స్టార్ గా ఎదిగింది. ఏమాయ చేశావే చిత్రంతో మొదలైన సమంత విజయాల పరంపర ఇంకా కొనసాగుతోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 21, 2022 / 12:20 PM IST
    Follow us on

    Samantha: అదృష్టం అన్నివేళలా కాపాడదు. అదృష్టానికి టాలెంట్, హార్డ్ వర్క్ కూడా తోడైనప్పుడు లాంగ్ టర్మ్ కెరీర్ సాధ్యమవుతుంది. సమంత కెరీర్ ను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. నిజానికి పరిశ్రమలో సమంతకు లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ ఉంది. కానీ.. ఆమె లక్కీ హీరోయిన్ కాదు, లకే వెతుక్కున్న క్రేజీ హీరోయిన్. సామ్ కేవలం తన కష్టంతోనే స్టార్ గా ఎదిగింది. ఏమాయ చేశావే చిత్రంతో మొదలైన సమంత విజయాల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోటా తన మార్కు చూపిస్తూ.. విజయం సాధిస్తుంది.

    Samantha

    అందుకే.. ఇప్పుడు సమంత మరో ఘనత సాధించింది. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు, ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్న ఘనత. దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ గా సమంత రికార్డు సృష్టించింది. అయితే, ఇది ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ.. సామ్ కి ఆ స్థాయి ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత సామ్.. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ క్రేజే సామ్ కి బాగా కలిసొచ్చింది. అందుకే.. సమంత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో నంబర్ వన్ హీరోయిన్ అయ్యింది.

    Also Read: Deepak Hooda: లక్కీ దీపక్ హుడా.. అతడుంటే టీమిండియా గెలిచినట్టే.. వరుసగా 16వ విజయం

    తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX INDIA’ నిర్వహించిన సర్వేలో జులై నెలకు సంబంధించి దేశంలో మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‌‌ గా సమంత నిలిచింది. ఇలాంటి వాటిల్లో బాలీవుడ్ హీరోయన్లు కాస్త ముందంజలో ఉంటారు. కానీ, ఈ సారి మాత్రం ఆశ్చర్యకరంగా సమంత నెంబర్ వన్ పొజిషన్ని దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఏది ఏమైనా సమంత ఏకంగా దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.

    ఇక సమంత తర్వాత స్థానాల విషయానికి వస్తే.. ఆలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనె, కీర్తి సురేశ్, పూజా హెగ్డే, రష్మిక మందాన, కత్రినా కైఫ్, కియారా అద్వానీ తదితరులు ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప లో సమంత ఐటెం సాంగ్ చేయడం ఆమెకు బాగా ప్లస్ అయ్యింది. పుష్ప మూవీ చూసిన ప్రతివారు… అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ తర్వాత సమంత ఐటెం సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

    Samantha

    ఊ అంటావా ఊ ఊ అంటావా.. సాంగ్ పుష్ప సినిమాకు హైలెట్ అన్నారు. మెయిన్ గా సమంత మాస్ స్టెప్స్, బోల్డ్ అటెంప్ట్ గురించి హిందీలో ప్రధానంగా చర్చ నడిచింది. సాంగ్ కోసం సమంత పరకాయ ప్రవేశం చేసిన తీరుకు పొగడ్తలతో ముంచెత్తారు. సాంగ్ కంటెంట్, బ్యాక్ గ్రౌండ్ సమంత ప్రెజెన్స్ తో ఎలివేట్ అయ్యింది. దీంతో సమంత టాలెంట్ గురించి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. చేసే పనిలో వంద శాతం అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది సమంత.

    అందుకే, సమంత సక్సెస్ కావడానికి కేవలం ఆమె అదృష్టం అనుకుంటే పొరపాటే. ఎంచుకున్న పాత్ర కోసం సమంత హార్డ్ వర్క్ చేస్తారు. పాత్ర డిమాండ్ మేరకు ఆంక్షలు పెట్టకుండా మాక్సిమమ్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎంచుకున్న రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడతారు. అదే ఆమెను మిగతా హీరోయిన్స్ కంటే స్పెషల్ గా మార్చేసింది. ఇప్పుడు నంబర్ వన్ గా నిలబెట్టింది.

    Also Read:Hyper Aadi- Pragathi: పిల్లల్ని పెంచమంటే అవి పెంచుతుంది… నటి ప్రగతిపై హైపర్ ఆది దారుణమైన కామెంట్స్

     

     

    Tags