https://oktelugu.com/

Treasure: ఈశ్వర ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు.. లంకె బిందె ఓపెన్ చేసి చూస్తే షాకింగ్..

కూలీలకు భూమి లోపల మట్టికుండ కనిపించింది. అందులో బంగారు ఆభరణాలు వెలుగు చూశాయి. ఇదే విషయాన్ని టాటా కాఫీ ఫామ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2023 1:00 pm
    Follow us on

    Treasure: భారతదేశం పురాతన వైభవానికి చిహ్నం. ఎంతోమంది రాజులు ఏలారు. ఎన్నో రాజ్యాలు వెలిశాయి. కానీ నాటి గురుతులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని ఓ శివాలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు చేపడుతుండగా. మట్టి కుండ బయటపడింది. అందులో అతి పురాతన బంగారు నాణేలు బయటపడడం విశేషం.

    కర్ణాటకలోని కొడగు జిల్లా వీరాజ్ పేట తాలూకా.. ఆనందపూర్ లో టాటా కాఫీ కార్పొరేషన్ కు చెందిన కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడే పురాతన ఈశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో పనులు చేస్తుండగా.. కూలీలకు భూమి లోపల మట్టికుండ కనిపించింది. అందులో బంగారు ఆభరణాలు వెలుగు చూశాయి. ఇదే విషయాన్ని టాటా కాఫీ ఫామ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు.

    ఈ విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇంతలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలను నియంత్రించారు. విరాజ్ పేట తహసిల్దార్ సమక్షంలో ఊరేగింపు నిర్వహించి.. కొడగు జిల్లా కలెక్టర్ కు నిధిని అందజేశారు. కాగా కర్ణాటకలో మరో ఘటన సైతం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై ఆలయ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.