Viral Video: 1000 వాలాతో ఈ బామ్మ బాంబ్ బ్లాస్ట్.. దీపావళి పూట షేక్ చేసే వీడియో చూడాల్సిందే…

దీపావళి 2023 సంవత్సర వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముందుగా దీపావళి నవంబర్ 12న నిర్వహించుకోవాలా? లేదా 13న చేసుకోవాలా? అనే కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో చాలా మంది 12నే పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణాల వారు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇంట్లో లక్ష్మీ పూజలతో పాటు నోముల పూజలు చేశారు. సాయంత్రం పూజలు పూర్తయిన తరువాత పిల్లలు, పెద్దలతో కలిసి బాణసంచా కాల్చారు. అయితే దీపావళి అనగానే చాలా మంది క్రాకర్స్ తో […]

Written By: NARESH, Updated On : November 13, 2023 1:09 pm
Follow us on

దీపావళి 2023 సంవత్సర వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముందుగా దీపావళి నవంబర్ 12న నిర్వహించుకోవాలా? లేదా 13న చేసుకోవాలా? అనే కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో చాలా మంది 12నే పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణాల వారు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇంట్లో లక్ష్మీ పూజలతో పాటు నోముల పూజలు చేశారు. సాయంత్రం పూజలు పూర్తయిన తరువాత పిల్లలు, పెద్దలతో కలిసి బాణసంచా కాల్చారు. అయితే దీపావళి అనగానే చాలా మంది క్రాకర్స్ తో పాటు బాణసంచా ఎక్కువగా కాలుస్తారు. ఇక పిల్లలకు ఇవి కాల్చడం ఎంతో ఇష్టం. కానీ ఓ బామ్మ థైజెండ్ వాలా పట్టుకొని అటూ ఇటూ తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో రకకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిదంటే?

బాణసంచా పేలుస్తుండడం వల్ల వాతావరణం కాలుష్యంగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం కొన్ని గంటలు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అవకాశం ఇచ్చింది. కానీ కొందరు రాత్రి వరకు పటాకలు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. కొందరు సాయంత్ర పూజ పూర్తయిన తరువాత కూడా పటాకలతో సందడి చేశారు. అయితే బాణ సంచాను ఎక్కువగా పిల్లలు కాల్చేందుకు ఉత్సాహం చూపుతారు. పెద్దవారు క్రాకర్స్ వరకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఓ బామ్మ మాత్రం పటాకల లడీతో సందడి చేసింది.

అద్వైత బతిక అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది సమాచారం లేదు. కానీ వీడియోల బామ్మ చేసే సాహసం చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అయితే ఇది ఓ గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. పాత ఇళ్ల మధ్య లొకేషన్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఓ బామ్మ పెద్ద లడీని ముట్టించి చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిప్పింది. సాధారణంగా ఇలాంటి లడిని స్టార్ట్ చేసి ఆ సౌండ్ భరించలేక దూరంగా పారిపోతారు. కానీ ఈ భామ్మ మాత్రం చేతిలో పట్టుకొని తిప్పడం చూసి షాక్ అవుతున్నారు.

ఈ వీడియో ఎప్పటిదైనా ఈ దీపావళి సందర్భంగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై కొంతమంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బామ్మ చేసిన సాహసం ఎవరూ చేయలేరని అంటున్నారు. మరోవైపు ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని వారిస్తున్నారు. ఏదీ ఏమైనా ఆ వయసులో ఇలాంటి సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికిగురి చేసిందని మరికొందరు కామెంట్ పెడుతున్నారు.