Donkey Farm In Karnataka: గాడిదలను కాస్తూ కోట్లాది రూపాయల ఆదాయం.. డాంకీస్ పాలెస్ ను ప్రారంభించిన ఇద్దరు యువకులు

Donkey Farm In Karnataka: ఎవరన్నా సరిగ్గా చదవకపోయినా.. సక్రమంగా పనిచేయకున్నా గాడిదలను కాస్తావ్ అని మందలించేవారు. కానీ చాలామందికి తెలియదు.. ఇప్పుడదే లాభదాయకంగా ఉందని. ఇప్పుడు ఎవరన్నా అలా అంటే కచ్చితంగా అది మంచి దీవెనే అవుతుంది. ఎందుకంటే గాడిదలను కాస్తూ లక్షలు సంపాదిస్తున్నారు ఆ యువకులు. లీటర్ గాడిద పాలను రూ.7000లకు అమ్ముతున్నారు. దాంతో ఆ వ్యాపారం లాభాల్లో నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ యువకుడు గాడిదలను కాస్తున్నాడు. అవును ఇది అక్షరాల […]

Written By: Dharma, Updated On : June 16, 2022 10:50 am
Follow us on

Donkey Farm In Karnataka: ఎవరన్నా సరిగ్గా చదవకపోయినా.. సక్రమంగా పనిచేయకున్నా గాడిదలను కాస్తావ్ అని మందలించేవారు. కానీ చాలామందికి తెలియదు.. ఇప్పుడదే లాభదాయకంగా ఉందని. ఇప్పుడు ఎవరన్నా అలా అంటే కచ్చితంగా అది మంచి దీవెనే అవుతుంది. ఎందుకంటే గాడిదలను కాస్తూ లక్షలు సంపాదిస్తున్నారు ఆ యువకులు. లీటర్ గాడిద పాలను రూ.7000లకు అమ్ముతున్నారు. దాంతో ఆ వ్యాపారం లాభాల్లో నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ యువకుడు గాడిదలను కాస్తున్నాడు. అవును ఇది అక్షరాల నిజం. ఇప్పుడీ వ్యాపారమే ఎంతో లాభదాయకంగా ఉంది. అందుకే తమిళనాడులో బాబు అనే వ్యక్తి గాడిదల ఫామ్ పెట్టాడు. దానిని ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రారంభించారంటే అతిశయోక్తిగా ఉంది కదూ.. అవును బాబు 17 ఎకరాల్లో 100 గాడిదలను పెంచుతున్నాడు. వాటి పాలను లీటర్ రూ.7000లకు అమ్ముతున్నాడు. సంస్థలతో డీల్ పెట్టుకుని గాడిదల పాలను విక్రయిస్తున్నాడు. దాంతో ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తుంది.

Donkey Farm In Karnataka

గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని సబ్బులు, లోషన్లు, రకరకాల క్రీముల్లో వాడుతుంటారు. దీంతో దేశవ్యాప్తంగా గాడిద పాలకు ఎంతో డిమాండ్ ఉంది. తమిళనాడుకు చెందిన యూఎస్ బాబు… ఆవు, గేదె, మేక లాంటి జంతువులను పెంచినట్టే ఇప్పుడు గాడిదలను పెంచుతూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. గ్రాడ్యుయేషన్ చేసిన బాబు మరెంతోమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాడు.

Also Read: Presidential elections 2022: విపక్షాలకు చిక్కని రాష్ట్రపతి అభ్యర్థి.. ఫలవంతం కాని తొలి భేటీ

వన్నారపేటకు చెందిన బాబు తమిళనాడులోని తిరునల్వేలిలో తొలి గాడిద ఫామ్‌ను స్థాపించాడు. గాడిదల పాలను బెంగళూరులోని ఓ కాస్మెటిక్ ఉత్పత్తుల కంపెనీకి సరఫరా చేస్తున్నాడు. లీటరు రూ.7 వేలకు విక్రయిస్తున్నాడు. బాబు కొంతకాలం ఫార్మా కంపెనీలో పని చేశాడు. అదే సమయంలో కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ ప్రతి నెలా వెయ్యి లీటర్ల గాడిద పాలను సరఫరా చేయగల వారి కోసం వెదుకుతున్నట్టు బాబు తెలుసుకున్నాడు. అయితే తమిళనాడులో మొత్తం రెండు వేల గాడిదలు మాత్రమే ఉన్నాయని, ఒక గాడిద రోజుకు 350 మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఇస్తుందని బాబు తెలుసుకున్నాడు.వెంటనే తానే సొంతంగా గాడిద ఫామ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

తన ఆలోచనను కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ వారెవరూ అంగీకరించలేదు. అయినా సరే బాబు తన ప్రయత్నాలను ఆపలేదు. 17 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, నెలయ్ జిల్లాలో వంద గాడిదలతో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. మే 14వ తేదీన జిల్లా కలెక్టర్ విష్ణు ఆ ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ఫామ్‌లో మూడు రకాల గాడిదలున్నాయి. ఈ గాడిదల పెంపకంపై బాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వాటికి మేత పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Donkey Farm In Karnataka

కర్నాటక జిల్లా మంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారమ్‌ను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలిన శ్రీనివాసగౌడ్ రూ.42లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో ఫారమ్ పెట్టారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెట్టిన గాడిదల పెంపకం, శిక్షణాకేంద్రం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. తాను 2020వ సంవత్సరం వరకు సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేశానని, దాన్ని వదిలేసి గాడిదలు కాస్తున్నానని శ్రీనివాసగౌడ్ చెప్పారు. ‘‘గాడిద పాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి, అందుకే గాడిద పాలు అందరికీ అందుబాటులో ఉంచాలనేది నా కల. ఈ పాలు ఔషధ ఫార్మలా’’ అని గౌడ్ వివరించారు. గాడిద జాతుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో తాను గాడిదల పెంపకం ఫాం పెట్టినట్లు యజమాని శ్రీనివాసగౌడ్ చెప్పారు. గాడిద ఫారమ్ గురించి మొదట్లో ప్రజలు నమ్మలేదని ఆయన పేర్కొన్నారు. గాడిద పాలను ప్యాకెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానని, 30 మిల్లీలీటర్ల గాడిద పాల ప్యాకెట్ ధర 150 రూపాయలని ఆయన వివరించారు.ఇవి గాడిద పాల ప్యాకెట్లను షాపింగ్ మాల్స్, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. తనకు ఇప్పటికే రూ.17లక్షల విలువైన గాడిద పాల ఆర్డర్లు వచ్చాయని మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన శ్రీనివాసగౌడ్ వివరించారు.

Also Read:YS Jagan- Presidential Election: జగన్ కు లేఖ పంపాం.. కేసులకు భయపడే రాలేదు.. తేల్చిచెబుతున్న టీఎంసీ వర్గాలు

Tags