Kangana Raunat : ‘రాజమౌళి లేకుంటే ఇండియన్ సినిమానే లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

Kangana Raunat : దర్శక ధీరుడు రాజమౌళి మగధీర సినిమా నుండి మన తెలుగు సినిమాని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లి, బాహుబలి సిరీస్ తో ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే అనే రేంజ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసి #RRR చిత్రం తో మన తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు.ఆయన గురించి ఏ చిన్న మాట అన్నా మన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ […]

Written By: NARESH, Updated On : February 18, 2023 10:42 pm
Follow us on

Kangana Raunat : దర్శక ధీరుడు రాజమౌళి మగధీర సినిమా నుండి మన తెలుగు సినిమాని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లి, బాహుబలి సిరీస్ తో ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే అనే రేంజ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసి #RRR చిత్రం తో మన తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు.ఆయన గురించి ఏ చిన్న మాట అన్నా మన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సినిమాని ప్రేమించే ఎవ్వరైనా ఒప్పుకోరు.

ఒకప్పుడు బాలీవుడ్ సినీ నటులకు సౌత్ సినిమాలన్నా మరియు తెలుగు సినిమాలన్నా చాలా చిన్న చూపు ఉండేది, ఇప్పుడు వాళ్ళు కూడా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు మన ఇండస్ట్రీ ని నిలబెట్టాడు.అంతే కాదు మనసులో ఏ చిన్న అభిప్రాయం ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిర్భయంగా మాట్లాడే తత్త్వం రాజమౌళి సొంతం.

అయితే రీసెంట్ గా రాజమౌళి హిందూ మతం పై చేసిన కొన్ని కామెంట్స్ ని కొంతమంది తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు.అలా రాజమౌళి పై విమర్శలు చేస్తున్న వారిమీద బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.ఆమె మాట్లాడుతూ ‘రాజమౌళి వ్యాఖ్యలపై అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు.దేవుడు ప్రతీ చోట ఉంటాడని మన పూర్వికులు సైతం చెప్తూ ఉంటారు.వాళ్ళ మాటలకు విలువ లేనట్టేనా?,అదే మాటని మేము చెప్తే మాత్రం తీవ్రంగా విరుచుకుపడుతారు.మతానికి వ్యక్తిరేకంగా మాట్లాడుతున్నట్టు మాపై ముద్ర వేస్తారు..ఎందుకంటే మేము సినీ సెలబ్రిటీస్ కాబట్టి.రాజమౌళి సార్ ని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను.ఆయన వర్షంలో మండే అగ్ని లాంటోడు, రాజమౌళి లాంటి వ్యక్తి మన ఇండియన్ సినిమా లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం.ఆయన చేసిన తప్పు ఏమిటి?, బాహుబలి మరియు #RRR వంటి సినిమాలతో మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేయడమేనా?, అలాంటి మహామనిషిని తిట్టేందుకు సిగ్గు ఉండాలి’ అంటూ కంగనా రనౌత్ రాజమౌళి తరుపున నిలబడి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.