Kangana Ranaut: కంగనా రనౌత్ కి ఆవేశం ఎక్కువ. ఆమెకు వ్యవస్థలంటే అసలు భయం లేదు. పైగా ఎప్పుడు ఎవరిని తిడుతుందో ఆమెకే తెలియదు.అందుకే, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా పోస్టులను సెన్సార్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చరణ్ జీత్ సింగ్ పిటిషన్ వేశాడు. అయితే, ఆ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శాంతిభద్రతల దృష్ట్యా భవిష్యత్తులో ఆమె చేసే ప్రతి పోస్టును పరిశీలించాలని అడ్వకేట్ చరణ్ జీత్ సింగ్ చందర్పాల్ చేసిన వినితిని తోసిపుచ్చింది.
Also Read: నీ ప్రేమ సల్లగుండ.. కంగనా.. మోడీని వదలవా?
దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కంగనా రనౌత్ ఏ అంశం పై మాట్లాడినా కొంత వాస్తవం ఉంటుందని.. అందుకే, ఆమె ఆ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుందని ఆమె తరుపు లాయర్ వాధించాడు. నిజమే సమాజంలోని చీకటి కోణాలను చూసి అనుభవించి అన్నిటినీ భరించి పైకి వచ్చిన హీరోయిన్ కంగనా. హీరోయిన్ గా ఎదగడానికి ఆమె చాలా కష్టాలు పడింది.
అందుకే, కంగనా ఎప్పుడూ ఏదో తెలియని కసితో రగిలిపోతూ ఉంటుంది. ఆమెను చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారని.. వాళ్ళల్లో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని. . బహుశా ఆ కోపంతోనే ఆమె కాస్త పరిధి దాటి బూతులు తిడుతుంది అని మొత్తానికి ఆమె తరుపు లాయర్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా చీకటి రాయుళ్ల బాగోతాలను బట్టబయలు చేస్తూ రోజుకొక రకంగా వాళ్ళకి టార్చర్ చూపిస్తూ వస్తోంది కంగనా.
Also Read: బాలీవుడ్ స్టార్ హీరో కి, ఆయన భార్య కి కరోన పాజిటివ్… ఎవరంటే ?