Ram Charan And Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా, చివరి షెడ్యూల్ ని అల్యూమినియం ఫ్యాక్టరీ లో గత వారం రోజున నుండి నాన్ స్టాప్ గా చేస్తున్నారు. మరో రెండు వారాల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ మొదటి వారం లోపు ఫస్ట్ కాపీ ని రెడీ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ తో సహా పూర్తి అయ్యింది. AR రెహమాన్ రీ రికార్డింగ్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. అందుకే శివరాత్రికి విడుదల చేద్దామని ప్లాన్ చేసిన రెండవ పాటని వాయిదా వేయాల్సి వచ్చింది. మార్చి రెండవ వారంలో ఈ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. రీసెంట్ గానే ఒక లవ్ స్టోరీ ని రామ్ చరణ్ కి వినిపించాడట, ఆయనకు తెగ నచ్చేసిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ‘పెద్ది’ మూవీ విడుదలకు ముందే వెలువడే అవకాశం ఉంది. అయితే రామ్ చరణ్ ఇప్పుడు లవ్ స్టోరీలు చేసే రేంజ్ ని ఎప్పుడో దాటేశాడు. ఆయన స్థాయి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో లార్జర్ థెన్ లైఫ్ రోల్స్ చేయడమే. అలాంటి సూపర్ స్టార్ తో లవ్ స్టోరీ అంటే అభిమానులు తీసుకోవడం కష్టమే. అందుకు ఉదాహరణగా రెబల్ స్టార్ ప్రభాస్ ని తీసుకోవచ్చు. ఆయన ఇమేజ్ కి చాలా తక్కువైన ‘రాధే శ్యామ్’ లాంటి లవ్ స్టోరీ ని చేసి కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని ఎదురుకున్నాడు.
ఇక రీసెంట్ గానే ఆయన చేసిన ‘రాజా సాబ్’ మూవీ ఫలితం ఎలాంటిదో కూడా కళ్లారా చూశాము. ఇది కూడా ఆయన ఇమేజ్ కి చాలా తక్కువ స్థాయి సినిమా. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అలాంటి పొరపాటు చేయొద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ లవ్ స్టోరీస్ చేసే స్థాయిని రెండవ సినిమాతోనే దాటేశాడు. ఆయన హీరోగా నటించిన ‘మగధీర’ చిత్రం సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో, ఆయన తదుపరి చిత్రం ‘ఆరెంజ్’ బాగున్నప్పటికీ ఆదరించలేదు ఆడియన్స్. అదే చిత్రాన్ని ఇప్పుడు ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసిన భారీ వసూళ్లను రాబడుతుంది. చూడాలి మరి బుచ్చి బాబు చేయబోతున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.