Prabhas: ఈమధ్య కాలం లో ఓటీటీ సంస్థలు నిర్మాతలకు పెడుతున్న ఆంక్షల కారణంగా సినీ నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా లాక్ డౌన్ సమయం లో, కేవలం ఓటీటీ రైట్స్ నుండే నిర్మాతలకు పెట్టిన బడ్జెట్ తిరిగి వెనక్కి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవు. ఓటీటీ సంస్థలకు కూడా వరుసగా నష్టాలు రావడం తో, సినిమా థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, భారీ వసూళ్లు సాధిస్తేనే మీరు కోరినంత డబ్బులు ఇస్తాము. లేదంటే మాట్లాడుకున్న దాంట్లో 50 శాతం తగ్గించి ఇస్తామంటూ నిర్మాతలకు చెప్తున్నారు. నెట్ ఫ్లిక్స్(Netflix) , అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థల రేంజ్ నుండి, చిన్న చిన్న ఓటీటీ సంస్థల వరకు ఇప్పుడు అందరూ ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ గురించి మాట్లాడుకోవాలి.
ఈ సంస్థ ఒక సినిమాని కొనుగోలు చెయ్యాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా, పైన చెప్పిన ఆంక్షలు తప్పవు, కానీ ఒక్క ప్రభాస్(Rebel Star Prabhas) కి మాత్రం ఇలాంటి ఆంక్షలను మినహాయించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇక నుండి రాబోయే ప్రతీ ప్రభాస్ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చెయ్యాలని ఫిక్స్ అయ్యిందట. అందుకోసం 9 వేల కోట్ల బడ్జెట్ టార్గెట్ ని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘స్పిరిట్’ చిత్రాన్ని కొనుగోలు చేసింది. దాదాపుగా 180 కోట్ల రూపాయిలను ఈ సినిమా కోసం వెచ్చించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ చిత్రం తర్వాత రాబోయే ‘ఫౌజీ’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ చిత్రాలకు విడుదల తేదీలను ప్రకటించగానే కొనుగోలు చేయడానికి సిద్ధం గా ఉందట.
వీటితో పాటు ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం, ఇక ఆ తర్వాత ఏ సినిమా విడుదలైన నెట్ ఫ్లిక్స్ లోనే ప్రభాస్ సినిమాలు ఉంటాయని టాక్. ప్రభాస్ కోసం వాళ్ళు కేటాయించిన 9000 కోట్ల బడ్జెట్ పూర్తి అయ్యే వరకు ఆయన సినిమాలు కొంటునే ఉంటారట. ఎందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రభాస్ సినిమాలకు ఇంత మక్కువ చూపిస్తుంది అంటే, ఆయన సినిమాలకు వచ్చిన వ్యూస్ అలాంటివి మరీ. సలార్ చిత్రానికి హిందీ వెర్షన్ లేకుండా ఏకంగా 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లోని మన ఇండియన్ భాషల్లో హిందీ బాషలోనే సినిమాలను చూసేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు ఆడియన్స్. ఉదాహరణకు ‘కల్కి’ చిత్రాన్ని తీసుకుందాం, ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కేవలం ఈ ఒక్క వెర్షన్ కి 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ హిందీ వెర్షన్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రభాస్ సినిమాలకే ఇలా జరిగాయి. చివరికి ఆదిపురుష్ హిందీ వెర్షన్ కి కూడా ఇక్కడ అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. ఈ కారణం చేతనే ప్రభాస్ సినిమాలను కొనుగోలు చేయడం కోసం అంతలా పరితపిస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ.