Homeఎంటర్టైన్మెంట్Volvo P1800s: 50 సంవత్సరాల కిందట మార్కెట్లోకి.. ఇప్పటికీ ఆదరణ తగ్గని కారు..

Volvo P1800s: 50 సంవత్సరాల కిందట మార్కెట్లోకి.. ఇప్పటికీ ఆదరణ తగ్గని కారు..

Volvo P1800s: లగ్జరీ కారులో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఈ అవకాశాన్ని పొందుతారు. అయితే ఖరీదైన కార్లు కొనాలని అనేవారు ఎక్కువగా Mercedes, Land rover వంటి కార్ల వైపు చూస్తారు. కానీ Volvo కంపెనీ కూడా ఆకర్షణీయమైన కార్లను ఉత్పత్తి చేస్తుంది. గతంలో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఓ కారు ఇప్పటికే ఆదరణ పొందుతుంది. ఈ కారు ఓల్డ్ లుక్ లో అందంగా ఉండటమే కాకుండా ఇందులో ప్రయాణం చేస్తే ప్రత్యేకమైన అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది.. అచ్చం అంబాసిడర్ కారులా కనిపించే ఇది 1961లో లాంచ్ అయింది. అప్పటినుంచి పలు మార్పులు చేసుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే ఈ కారులో ఉండే పర్ఫామెన్స్ ఏంటిదో ఒకసారి చూద్దాం..

Volvo నుంచి 1961 లో మార్కెట్లోకి వచ్చిన P1800 కారు అప్పట్లో అందరినీ ఆకర్షించింది. ఈ కారులో 1.8 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్.. 100 హార్స్ పవర్, 147 NM టార్క్ రిలీజ్ చేసేది. ఆ తర్వాత పలు మార్పులు చేసుకున్న తర్వాత 115 నుంచి 120 HP వరకు పెరిగింది. ఇంజన్ సైతం 2.0 లీటర్ వరకు అప్గ్రేడ్ అయింది. ఈ ఇంజన్ పై టాప్ స్పీడ్ 170 నుంచి 190 కిలోమీటర్ల వరకు స్పీడ్ ఉండేది. ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ ఆకర్షణీయమైన లుక్ తో ఉండేది. దీని ఫ్యూయల్ ట్యాంక్ 45 లీటర్లు, 4 సీట్లు, వీల్ బేస్ 2450 ఉండే ఈ కారులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియల్ డ్రమ్స్, ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తుంది.

ఈ కారును ఎక్కువగా సినిమా షూటింగ్ కోసం వాడేవారు. టీవీ సిరీస్ అయినా ది సెయింట్ లో రోజర్ మూర్ దీనిని వాడారు. అయితే ఈ కారు ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. ఇది కొత్త మోడల్ లేకపోయినా పాత కారును కొందరు కొనుగోలు చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. 8,750 నుంచి 57,443 డాలర్స్ వరకు ధర ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 24 నుంచి 25 లక్షల వరకు ఉంటుందన్నమాట. భారత్లో నేరుగా కొనుగోలు చేయడానికి ఈ కారు అందుబాటులో లేదు. అయితే అమెరికాలో దీనిని కొనుగోలు చేసి ఇంపోర్టు చేసుకుంటే ట్యాక్స్ లతో కలిపి రూ.30 నుంచి రూ.80 లక్షల వరకు పొందవచ్చు. ఈ కారు మైలేజ్ ఇవ్వడంతోపాటు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రీమియం లుక్స్ కావాలని అనుకునేవారు.. లగ్జరీ కార్లలో తిరగాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version