Kalyan Ram’s Remix song : యూట్యూబ్ ని ఊపేస్తున్న కళ్యాణ్ రామ్ రీమిక్స్ పాట

Kalyan Ram’s Remix song : ‘భింబిసారా’ హిట్ తో మంచి ఊపు మీదున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ ద్వారా రేపు థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నాడు.నందమూరి అభిమానుల్లో ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.వాస్తవానికి నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ గా ఉంటేనే ఒక సినిమా మీద ఆసక్తి చూపిస్తారు, అలాంటిది ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో వస్తున్న స్టోరీ మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నారంటే కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చిందనే […]

Written By: NARESH, Updated On : February 9, 2023 8:59 pm
Follow us on

Kalyan Ram’s Remix song : ‘భింబిసారా’ హిట్ తో మంచి ఊపు మీదున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ ద్వారా రేపు థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నాడు.నందమూరి అభిమానుల్లో ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.వాస్తవానికి నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ గా ఉంటేనే ఒక సినిమా మీద ఆసక్తి చూపిస్తారు, అలాంటిది ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో వస్తున్న స్టోరీ మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నారంటే కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చిందనే చెప్పొచ్చు.

అయితే ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటూనే అభిమానులు కోరుకున్న అంశాలు మిస్ కాకుండా డైరెక్టర్ రాజేందర్ రెడ్డి చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది..కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్నే చెప్పుకొచ్చారు.అందుకు ఉదాహరణ గా ఈ సినిమా నుండి విడుదలైన ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మా’ అనే పాటని చెప్పుకోవచ్చు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘ధర్మక్షేత్రం’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఎన్నో రాత్రులు వస్తాయి గానీ’ అనే పాటని రీమిక్స్ చేసాడు.సాధారణంగా విడుదలకు ముందు సినిమా నుండి వీడియో సాంగ్స్ ఎవ్వరూ కూడా రిలీజ్ చెయ్యరు..కానీ ఈ సినిమాలో హైలైట్ గా మారిన ఈ రీమిక్స్ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేసేసారు.ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈమధ్యనే విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో టాప్ 2 స్థానం లో ట్రేండింగ్ అవుతూ 7.5 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది..ముఖ్యంగా ఈ సాంగ్ లో ఆషిక రంగనాథ్ అందాలకు కుర్రకారులు పిచ్చెక్కిపోయారు.అందుకే అంత అద్భుతమైన వ్యూస్ ఈ సాంగ్ కి వచ్చాయని చెప్తున్నారు విశ్లేషకులు.మరి వెండితెర మీద ఈ సాంగ్ ఎంత అందంగా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.