Kajal Aggarwal: వయసుతో పాటు వచ్చే మార్పులు అంగీకరించక తప్పదు. ఒక దశ దాటాక ఫిట్నెస్ పై శ్రద్ధ లేకపోతే షేప్ అవుట్ అయిపోతారు. ఇక పెళ్లి తర్వాత అమ్మాయిల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తల్లి అయ్యాక తేలికగా బరువు పెరుగుతారు. సూపర్ స్లిమ్ గా ఉండే కాజల్ సైతం ఇదే కారణం బరువు పెరుగుతున్నారనిపిస్తుంది. కాజల్ బాడీ మునుపటిలా లేదు. ఆమె బొద్దుగా కనిపిస్తున్నారు. తాజా వీడియోలో ఈ విషయం అర్థం అవుతుంది.

ఓ వ్యాపార ప్రకటనలో భాగంగా కాజల్ వీడియో చేశారు. సదరు వీడియోలో కాజల్ గ్రీన్ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించారు. కాజల్ లో బరువులో వచ్చిన మార్పు తెలుస్తుంది. ఆమె బొద్దుగా తయారయ్యారు. డెలివరీ తర్వాత కూడా కాజల్ లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ మధ్య కాలంలో కాజల్ కొంత మేర షేప్ అవుట్ అయ్యారనిపిస్తుంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. కాజల్ ఇంకొంచెం వెయిట్ పెరిగితే కష్టమే. పరిశ్రమకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది.
2020 లాక్ డౌన్ ఆంక్షల మధ్య కాజల్ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే కాజల్ వివాహానికి హాజరయ్యారు. చాలాకాలంగా పరిచయం ఉన్న మిత్రుడు గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకున్నారు. గత ఏడాది చివర్లో కాజల్ ప్రెగ్నన్సీ ప్రకటించారు. 2022 ఏప్రిల్ నెలలో అబ్బాయికి జన్మనిచ్చారు. నీల్ కిచ్లుగా నామకరణం చేశారు. డెలివరీ తర్వాత శరీరంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా కాజల్ లావు అవుతున్నారు.

హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. షేప్ అవుట్ అయితే మార్కెట్ పోయినట్లే. కాబట్టి మరికొంత కాలం ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే కాజల్ ఫిట్ బాడీ సాధించాలి. హీరోయిన్ గా కాజల్ లాంగ్ కెరీర్ కలిగి ఉన్నారు. ఆమె ఇండస్ట్రీలో అడ్డుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలవుతుంది.డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం కాజల్ కి తెలుగులో మొదటి చిత్రం. మగధీర మూవీ కాజల్ కి బ్రేక్ ఇచ్చింది. ఈ జనరేషన్ టాప్ స్టార్స్ అందరితో నటించిన కాజల్, చిరంజీవితో కూడా జతకట్టారు. ప్రస్తుతం కాజల్, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో నటిస్తున్నారు. భారతీయుడు 2 షూట్ జరుపుకుంటుంది.