Haripriya : కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ..వాళ్ళు పోషించిన అద్భుతమైన పాత్రల వల్ల చిరస్థాయిగా గుర్తుండిపోతారు..వీళ్ళు ఇష్టమొచ్చినట్టు అందాల ఆరబోతలు చెయ్యడం, నటనకి ప్రాధాన్యత లేని పాత్రలు పోషించడం వంటివి చెయ్యరు..వాళ్ళ మనసుకు నచ్చితేనే సినిమా చేస్తారు..లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినా చెయ్యరు..అలాంటి పద్దతిగల హీరోయిన్స్ లో ఒకరు హరిప్రియ.

ఈమె న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది..తొలిసినిమా తోనే చక్కటి నటనతో ప్రేక్షకుల అభిమానం ని చూరగొంది ఈమె..ఈ సినిమా తర్వాత ఆమె బాలయ్య బాబు తో జై సింహా , తకిట తకిట, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా మరియు గలాటా వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది..వీటిల్లో పిల్ల జమిందార్ మరియు జై సింహా చిత్రాలు మినహా మిగిలిన సినిమాలేవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు.
ఇక్కడ హీరోయిన్ గా రాణించకపోయిన..కన్నడ లో మాత్రం స్టార్ హీరో గా ఎదిగింది..అక్కడ ఈమె స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది..అయితే ఈమె త్వరలోనే KGF లో విలన్ గా నటించిన వసిష్ఠ సింహా అనే అతనిని పెళ్లాడబోతుంది..ఇతను కేవలం కేజీఎఫ్ సిరీస్ లో మాత్రమే కాదు, తెలుగు లో నారప్ప, నయీమ్ డైరీస్ మరియు ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాలలో నటించాడు..కానీ KGF మరియు నారప్ప సినిమాల ద్వారానే ఇతనికి మంచి పాపులారిటీ వచ్చింది.
ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది..’మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము..పెద్ద ఆశీసులతో మా నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది..మా పెళ్లి కి మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ హరి ప్రియా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియచేసింది..వీళ్లిద్దరి నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారిపోయింది.