Kajal Agarval Ad: భర్తతో మందుకొడుతూ కాజల్ పేకాట.. నెటిజన్ల ట్రోల్స్

Kajal Agarval Ad: యాడ్స్ కోసం బట్టలు చింపుకునే సెలబ్రెటీలున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, గుట్కా, సిగరెట్ యాడ్స్ లలో కూడా అగ్రహీరోలు నటిస్తూ కాసులు సంపాదిస్తున్న రోజులివి. నేనేం తక్కువ తిన్నాన అని ఆలోచించిన కాజలమ్మ తాజాగా ఓ మందు యాడ్ లో ఏకంగా భర్తతో కలిసి మందు ఏస్తూ పేకాట ఆడుతున్నట్టుగా ప్రకటనలో నటించింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. సెలబ్రెటీలన్నాక కాస్త అయినా బాధ్యత, గౌరవం ఉండాలని.. ఇలా డబ్బుల […]

Written By: NARESH, Updated On : November 1, 2021 9:41 pm
Follow us on

Kajal Agarval Ad: యాడ్స్ కోసం బట్టలు చింపుకునే సెలబ్రెటీలున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, గుట్కా, సిగరెట్ యాడ్స్ లలో కూడా అగ్రహీరోలు నటిస్తూ కాసులు సంపాదిస్తున్న రోజులివి. నేనేం తక్కువ తిన్నాన అని ఆలోచించిన కాజలమ్మ తాజాగా ఓ మందు యాడ్ లో ఏకంగా భర్తతో కలిసి మందు ఏస్తూ పేకాట ఆడుతున్నట్టుగా ప్రకటనలో నటించింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది.

kajal agarval liqur add

సెలబ్రెటీలన్నాక కాస్త అయినా బాధ్యత, గౌరవం ఉండాలని.. ఇలా డబ్బుల కోసం అగ్రహీరోయిన్ కాజల్ ఒక మద్యం యాడ్ లో మందు తాగుతూ పేకాట ఆడుతున్నట్టు భర్తతో కలిసి నటించడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే విమర్శలు చెలరేగడంతో పొగాకు యాడ్ నుంచి బిగ్ బి అమితాబ్ తప్పుకున్నారు. జనాలను చెడు అలవాట్లకు ప్రోత్సహించవద్దని విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ మధ్య హీరోయిన్ రెజీనా విస్కీ బ్రాండ్ సిగ్నేచర్ యాడ్ లో నటించి వివాదాలు కొనితెచ్చుకుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మద్యం తాగండి అంటూ ప్రకటన చేయడం వివాదాస్పదమైంది. తన భర్తతో కలిసి టీచర్స్ అల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ లో నటించింది కాజల్. ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా మందు కొడుతున్నట్టుగా పేకాట ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలును ఏకంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి దుమారం రేపింది.

మందు తాగుతూ పేకాట ఆడుతున్నట్టు ఈ యాడ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భర్తతో కలిసి మందుతాగుతూ నటించడమే కాకుండా జనాలను తాగండని దీపావళి సందర్భంగా పిలుపునిస్తావా? అని ఛీఛీ అంటూ కాజల్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.