Homeఎంటర్టైన్మెంట్Kajal Agarval Ad: భర్తతో మందుకొడుతూ కాజల్ పేకాట.. నెటిజన్ల ట్రోల్స్

Kajal Agarval Ad: భర్తతో మందుకొడుతూ కాజల్ పేకాట.. నెటిజన్ల ట్రోల్స్

Kajal Agarval Ad: యాడ్స్ కోసం బట్టలు చింపుకునే సెలబ్రెటీలున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, గుట్కా, సిగరెట్ యాడ్స్ లలో కూడా అగ్రహీరోలు నటిస్తూ కాసులు సంపాదిస్తున్న రోజులివి. నేనేం తక్కువ తిన్నాన అని ఆలోచించిన కాజలమ్మ తాజాగా ఓ మందు యాడ్ లో ఏకంగా భర్తతో కలిసి మందు ఏస్తూ పేకాట ఆడుతున్నట్టుగా ప్రకటనలో నటించింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది.

kajal agarval liqur add
kajal agarval liqur add

సెలబ్రెటీలన్నాక కాస్త అయినా బాధ్యత, గౌరవం ఉండాలని.. ఇలా డబ్బుల కోసం అగ్రహీరోయిన్ కాజల్ ఒక మద్యం యాడ్ లో మందు తాగుతూ పేకాట ఆడుతున్నట్టు భర్తతో కలిసి నటించడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే విమర్శలు చెలరేగడంతో పొగాకు యాడ్ నుంచి బిగ్ బి అమితాబ్ తప్పుకున్నారు. జనాలను చెడు అలవాట్లకు ప్రోత్సహించవద్దని విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ మధ్య హీరోయిన్ రెజీనా విస్కీ బ్రాండ్ సిగ్నేచర్ యాడ్ లో నటించి వివాదాలు కొనితెచ్చుకుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మద్యం తాగండి అంటూ ప్రకటన చేయడం వివాదాస్పదమైంది. తన భర్తతో కలిసి టీచర్స్ అల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ లో నటించింది కాజల్. ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా మందు కొడుతున్నట్టుగా పేకాట ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలును ఏకంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి దుమారం రేపింది.

మందు తాగుతూ పేకాట ఆడుతున్నట్టు ఈ యాడ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భర్తతో కలిసి మందుతాగుతూ నటించడమే కాకుండా జనాలను తాగండని దీపావళి సందర్భంగా పిలుపునిస్తావా? అని ఛీఛీ అంటూ కాజల్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version