https://oktelugu.com/

MegaStar Chiranjeevi: మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా తమన్నా… త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్

MegaStar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను పెట్టారు. అయితే  ‘భోళా శంకర్’ చిత్రంలో తన  పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ పాత్ర ఎవరు చేయబోతున్నారో తెలిసిపోయింది.  కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 09:27 PM IST
    Follow us on

    MegaStar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను పెట్టారు. అయితే  ‘భోళా శంకర్’ చిత్రంలో తన  పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ పాత్ర ఎవరు చేయబోతున్నారో తెలిసిపోయింది.  కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

    అయితే తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయడానికి నిర్మాతలకు రెండు నెలల సమయం పట్టింది అని చెప్పాలి. తమన్నా ఈ సినిమాలో నటించనున్నట్లు అఫీషియల్ గా ఒకే అయింది. కొన్నిరోజుల్లో మూవీ యూనిట్  ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో తమన్నా నటించింది. కానీ తెరపై వీరి కాంబినేషన్ పై విమర్శలు వినిపించాయి. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్… కూడా నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి కనిపించనుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది.

    జనవరి నెల నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గోనుంది అని సమాచారం. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా…  ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.