Avatar 3 copied RRR concept: #RRR మూవీ గ్లోబల్ వైడ్ గా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో విడుదలై వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, బాహుబలి 2 కి దగ్గర్లోకి కూడా వెళ్లలేకపోయిందే, KGF చాప్టర్ 2 కూడా #RRR ని దాటేసింది , రాజమౌళి(SS Rajamouli) రేంజ్ హిట్ కాదు అని చాలా మంది అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాక ఈ సినిమాకు దక్కిన ఆదరణ చూసి రాజమౌళి సైతం షాక్ కి గురయ్యాడు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు పశ్చిమ దేశాలకు సంబంధించిన వారు ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. వారిలో అవతార్, టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్(James Cameron) కూడా ఒకరు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఆయన రాజమౌళి తో మాట్లాడుతున్న వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
ఈ సినిమాని జేమ్స్ కెమరూన్ నాలుగు సార్లు చూశాడట. దయచేసి మా హాలీవుడ్ లోకి మాత్రం రాకు, మా అవకాశాలకు గండి కోట్లకు అంటూ జేమ్స్ కెమరూన్ అప్పట్లో రాజమౌళి తో జరిపిన సంభాషణ హైలైట్ గా నిల్చింది. అప్పటి నుండే వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలైంది. నేడు జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 3′(Avatar 3 : The Fire & Ash) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలైంది. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు జేమ్స్ కెమరూన్ ఈ చిత్రాన్ని ప్రముఖ మీడియా ప్రతినిధులకు, మరియు తన సన్నిహితులకు స్పెషల్ షో వేసి చూపించాడు. అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక వీడియో కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ సంభాషణలో ‘వారణాసి’ మూవీ సెట్స్ లోకి నన్ను రానిస్తారా అని అడగడం, రాజమౌళి అందుకు ‘మీరు మా సెట్స్ కి వస్తే, మాకు మాత్రమే కాదు, మా పరిశ్రమ మొత్తానికి గౌరవం దక్కినట్టు అవుతుంది’ అని చెప్పడం చూసే ఆడియన్స్ కి ఎంతో మంచిగా అనిపించింది.
ఇదంతా పక్కన పెడితే ‘అవతార్ 3’ కాన్సెప్ట్ ని జేమ్స్ కెమరూన్ #RRR నుండి ప్రేరణ పొందాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. #RRR మూవీ థీమ్ ఫైర్ & వాటర్ మీద ఉంటుంది. ఈ ఆలోచన ఎదో చాలా బాగుందే, మన సినిమాకు కూడా ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్’ అని పేరు పెడితే అదిరిపోతుందని జేమ్స్ కెమరూన్ రాజమౌళి నుండి కాపీ కొట్టి ఈ టైటిల్ ని పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ‘అవతార్ 3’ క్యాప్షన్ చూస్తుంటే నిజమేనేమో అనే అనుమానం కలగడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.