https://oktelugu.com/

Actor Surya: మరోసారి మంచి మనసు చాటుకున్న హీరో సూర్య…

Actor Surya: హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. విభిన్న చిత్రాలు, వైవిద్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలానే సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుండే సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. అయితే తాజాగా ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు రూ. కోటి విరాళం ఇచ్చి మరోసారి మంచి మనస్సును చాటుకున్నాడు. ఈ చెక్కును తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సూర్య, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 09:47 PM IST
    Follow us on

    Actor Surya: హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. విభిన్న చిత్రాలు, వైవిద్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలానే సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుండే సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. అయితే తాజాగా ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు రూ. కోటి విరాళం ఇచ్చి మరోసారి మంచి మనస్సును చాటుకున్నాడు. ఈ చెక్కును తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సూర్య, జ్యోతిక దంపతులు కలిసి అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును  రిటైర్డ్ జస్టిస్ కె చంద్రు, పజంకుడి ఇరులార్ ట్రస్ట్ సభ్యులు సమక్షంలో  సీఎం ఎంకే స్టాలిన్ స్వీకరించారు.

    ప్రస్తుతం జ్ఞానవేల్‌ దర్శకత్వంలో జై భీమ్‌ సినిమాలో నటిస్తున్నాడు సూర్య. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం. ఈ సినిమా నవంబర్‌ 2 వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్‌ కాబోతుంది. ఇక ఈ సినిమా సూర్య, జ్యోతికల స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సీన్‌ రోల్డాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఒక గిరిజన మహిళకు న్యాయం జరగడానికి పరితపించే లాయర్ గా సూర్య కనిపించనున్నారు.

    ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన వారంతా వారి పాత్రలకు ప్రాణం పోశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి.  అలానే రావు రమేశ్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.