Nissan Sub-4m MPV: నేటి కాలంలో చాలామందికి ఆర్థిక స్థిరత్వం పెరిగిపోయింది. అందువల్లే తమ స్థాయికి తగ్గట్టుగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు టూవీలర్లు ఉంటేనే గొప్ప అనుకునేవారు. ఇప్పుడు ఫోర్ వీలర్ లు ఉంటేనే తమ స్థాయి గొప్పగా ఉందని భావిస్తున్నారు. అందులోనూ రకరకాల డిజైన్లు కోరుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కంపెనీలు కూడా రకరకాల మోడల్స్ రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ హవా నడుస్తోంది. అందులో నిస్సాన్ కంపెనీ sub 4m mpv ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి gravite అని పేరు పెట్టింది.
గ్రావైట్ మోడల్లో సెవెన్ సీటర్ సామర్థ్యం ఉంది. ఈ మోడల్ చూస్తుంటే రెనాల్ట్ కంపెనీ స్పోర్ట్స్ కార్ రిపేర్ మాదిరిగా కనిపిస్తోంది. కాకపోతే డిజైన్ లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. వచ్చేయడాది జనవరిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.. కారు ముందు భాగంలో గ్రావైట్ అనే అక్షరాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.. ఎల్ఈడి దీపాలు పటిష్టమైన డిజైన్ లో దర్శనమిస్తున్నాయి. ఎల్ఈడి దీపాలు కారుకు అధునాతనమైన రూపాన్ని ఇస్తున్నాయి. కారు బానేట్ పూర్తిగా ప్లాట్ గా దర్శనమిస్తోంది.. బంపర్ సి షేప్ లో కనిపిస్తోంది. దానికి సిల్వర్ కోటింగ్ ఇచ్చారు.
ఈ కారుకు సంబంధించి పూర్తి రూపాన్ని విడుదల చేయకపోయినప్పటికీ సైడ్ యాంగిల్ లో మాత్రం కారు పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. కారు డోర్ హ్యాండిల్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. వీల్స్ డ్యూయల్ టోన్ ఆలోయూస్ ను కలిగి ఉన్నాయి. కారు చివరి భాగంలో ఉన్న దీపాలు కూడా నిస్సాన్ లోగోకు దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాయి.. గ్రావేట్ లోగోను కూడా అద్భుతంగా ప్లేస్ చేశారు.. బంపర్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇంటీరియర్ లో గ్రాండ్ లుక్ కనిపిస్తోంది.. ఇందులో 8 ఇంచుల ఆపిల్ డిజిటల్ కార్ ప్లే ను అందుబాటులో ఉంచారు. పుష్ బటన్ , స్టార్ట్, స్టాప్, మాన్యువల్ ఏసి అనేవి ఈ కారుకున్న ప్రధాన ఆకర్షణలు.
రిమోట్ కీ లెస్ ఎంట్రీ, వైర్లెస్ ఫోన్ చార్జర్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టం ఈ కారుకు ఉన్న ప్రధాన ఆకర్షణలు. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టం ఉంది.. అదేవిధంగా టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టం కూడా ఈ కారుకు ఉంది. ఈ కారుకు 72 పవర్ పిఎస్, 96 టార్క్యూ ఎన్ ఎం, 5 స్పీడ్ ఏఎంటీ/ 5 స్పీడ్ ఏఎంటి వంటి ఫీచర్స్ ఉన్నాయి.