kagney linn karter: ప్రముఖ శృంగార తార ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. ఆమె అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన కాగ్నీ లిన్ కార్టర్ బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయసు 36 ఏళ్ళు. కాగ్నీ లిన్ కార్టర్ 1987 మార్చ్ 28న జన్మించింది. పెన్సిల్వేనియాలో పెరిగిన కాగ్నీ లిన్ కార్టర్ చదువుకునే రోజుల్లో సింగర్ గా ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే పలు ప్రసంగాలు, డిబేట్స్ లో పాల్గొన్నారు. ఈమె చీర్ లీడర్ కూడాను.
కాగ్నీ లిన్ కార్టర్ నటిగా రాణించాలని అనుకున్నారు. గాయనిగా ఎదగాలని కూడా కలలు కన్నారు. కొన్నాళ్ళు ఓ మెక్సికన్ రెస్టారెంట్ లో హోస్టెస్ గా పని చేసింది. అనంతరం అడల్ట్ ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టారు. బోల్డ్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ మ్యాగజైన్ కవర్స్ పై ఆమె ఫోటోలు ప్రచురితం అయ్యాయి. శృంగార తరాలకు ఇచ్చే ఏవిఎన్ ఆమె గెలుచుకున్నారు.
మరణానికి కొన్ని రోజులు ముందు కాగ్నీ లిన్ కార్టర్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. బీచ్ లో స్విమ్ సూట్ లో ఆమె కనిపించారు. హాయ్ ఫ్రమ్ ఫ్లోరిడా అని సదరు ఫోటోకి కామెంట్ జోడించారు. గో ఫండ్ మీ పేరుతో ఆమె సన్నిహితులు ఒక పేజ్ క్రియేట్ చేశారు. కాగ్నీ లిన్ కార్టర్ అంత్యక్రియలకు అవసరమైన డబ్బును సదరు పేజ్ ద్వారా సేకరిస్తున్నారు.
మల్టీ టాలెంటెడ్ కాగ్నీ లిన్ కార్టర్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆమె మరణానికి ప్రధాన కారణం ఇదే కావచ్చని సన్నిహితులు వెల్లడించారు. కాగ్నీ లిన్ కార్టర్ కెరీర్ లో ఎన్నో స్ట్రగుల్స్, ఒంటరి తనం ఫేస్ చేశారట. కాగ్నీ లిన్ కార్టర్ హఠాన్మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.