Bird Flue In Telangana : ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. నెల్లూరు జిల్లాలో దీనిని గుర్తించడంతో అధికారులు చికెన్ అమ్మకాలపై నిషేధించారు. కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ చికెన్ తినడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో చికెన్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? అనే చర్చ తీవ్రమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మేడారం జాతర ఉన్నందున చికెన్ అమ్మకాల పెరిగే అవకాశం ఉంది. లైవ్ బర్డ్ లకు మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ అలా జరగలేదు. ధరలు స్తిరంగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందా? అని అనుకుంటున్నారు. అయితే తెలంగాణలో చికెన్ దరలు ఎలా ఉన్నాయంటే?
2024 ఫిబ్రవరి 21 ప్రకారం తెలంగాణలోని హైదరాబాద్ లో కిలోచికెన్ దర రూ.200 తో విక్రయిస్తున్నారు. సుగుణ చికెన్ రూ.210, లైవ్ చికెన్ రూ.140తో అమ్ముతున్నారు. అలాే బోన్ లెస్ రూ.230, దేశీ చికెన్ రూ.340, చికెన్ లివర్ రూ.180, స్కిన్ లెస్ చికెన్ ను రూ.210తో విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ధరలే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత సీజన్ ప్రకారం చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉండేది. కానీ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. బర్డ్ ఫ్లూ ను అధికారులు గుర్తించి కట్టడి చేస్తున్నారని, ఇది విస్తరించే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చికెన్ తినడం తగ్గించారు. చికెన్ కు బదులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపత్యంలో మటన్, ఫిష్ అమ్మకాలు పెరుగుతున్నాయి.
ఏపీలోని బర్డ్ ఫ్లూ తో తెలంగాణలో ప్రభావం ఉంటుందని కొందరు చికెన్ తినడం మానేయడంతో చాలా వరకు నష్టం వస్తుందని కొందరు అంటున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కానీ బర్డ్ ఫ్లూ పై ఇప్పటి వరకు అధికారులు ప్రకటన చేయలేదని, అందువల్ల చికెన్ తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని కొందరు వ్యాపారులు అంటున్నారు. కానీ వినియోగదారులు మాత్రం చికెన్ కొనడానికి ఆలోచిస్తున్నారు.