Car Repair: ఇదేందయ్యా ఘోరం : రూ.7 లక్షల కారు రిపేర్‌కు రూ.8 లక్షలా?

గత డిసెంబర్‌లో తమిళనాడులో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదలకు ఓ వ్యక్తి కారు నీటమునికి పూర్తిగా చెడిపోయింది.

Written By: Raj Shekar, Updated On : February 21, 2024 8:36 am
Follow us on

Car Repair: వరదల్లో పాడైన కారును రిపేర్‌ చేయడానికి ఓ షోరూం వాళ్లు కారు ధరకు మించిన ఎస్వేటిమేషన్ వేసి యజమానికి షాక్‌ ఇచ్చారు. చెన్పైలో ఈ ఘటన జరగగా, ఆలస్యంగా ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. కారు ధరకు మించి రిపేర్‌ చార్జీల అంచనా వేసిన సదరు కంపెనీని ట్రోల్‌ చేస్తున్నారు.

ఏం జరిగిందటే..
గత డిసెంబర్‌లో తమిళనాడులో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదలకు ఓ వ్యక్తి కారు నీటమునికి పూర్తిగా చెడిపోయింది. చాలా మంది కార్లు నీటమునిగాయి. అయితే ఓ వినియోగదారుడు కారు మరమ్మతు కోసం గిండీ హ్యుండాయ్‌ షోరూంకు తీసుకెళ్లాడు. అక్కడ కారును పరిశీలించిన మెకానిక్‌లు.. రిపేర్‌ చార్జి ఎస్టిమేట్‌ వేసి యజమానికి అందించారు. ఆ కాపీ చూసిన యజమాని షాక్‌ అయ్యాడు. కొత్త కారు విలువ రూ.7 లక్షలు ఉంటే.. రిపేర్‌కు రూ.8 లక్షల ఎసి‍్టమేషన్‌ వేశారు. దీంతో సదరు యజమాని తాను వేరే గ్యారేజీకి వెళ్తానని చెప్పాడు. అయితే ఎస్టిమేషన్‌ చార్జి రూ.5,900 చెల్లించాలని వసూలు చేశారు.

ప్రైవేటుగా మర్మతుకు రూ.45..
ఇక అదే కారును సదరు యజమాని మరో మెకానిక్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అన్నీ పరిశీలించి మొత్తం క్లీన్‌ చేశారు. చెడిపోయిన పార్ట్‌ మార్చేశాడు. పాత కార్‌ను మళ్లీ కొత్తగా చేశాడు. ఇందుకు మొత్తం అతను రూ.45 వసూలు చేశాడు. ఈ విషయాన్ని కారు యజమాని స్వయంగా వెల్లడించారు.

ట్రోల్‌ చేస్తున్న నెటజన్లు..
కారు ధర రూ.7 లక్షలు అయితే.. రిపేర్‌కు రూ.8 లక్షలా ఎవడ్రా ఆ మెకానిక్‌ అని కొందరూ.. ఇంత దోపిడీనా.. ఇదెక్కడ చూడలే.. అంటూ కొందరు, ఆ కంపెనీని బ్యాన్‌ చేయాలని మరికొందరు.. షోరూం సీజ్‌ చేయాలని ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

2022లో కూడా..
2022లో కర్ణాటకలో వరదలు వచ్చాయి. ఈ వరదలో‍్ల బెంగళూరుకు చెందిన అనిరుధ్‌ గణేశ్‌ కారు పాడైంది. పూర్తిగా నీట మునగడంతో ఇంజిన్‌ పనిచేయలేదు. దీంతో వోక్స్‌వాగ్‌ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాడు. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్‌ కోసం రూ.22 లోలు అవుతుందని అంచనా వేసి పంపించారు. కారు ఖరీదు రూ.11 లక్షలు అయితే రిపేర్‌కు రూ.22 లక్షల ఎస్టిమేషన్‌ చూసి షాక్‌ అయిన గణేశ్‌ ఇన‍్సూరెన్స్‌ సంస్థను సంప్రదించాడు. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్‌ సెంటర్‌ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లడానికి రూ.44,840 చెల్లించాలని సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు చెప్పారు. కారు డ్యామేజీ అంచనా వేసి పత్రాలు సిద్ధం చేసేందుకు ఫీజు కట్టాలని సపష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన ఇన్సూరెన్స్‌ సంస్థవారు వోక్స్‌వాగ్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంత చివరకు రూ.5 వేలు కట్టి కారు తీసుకెళ్లారు.