Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Jagan: జ్యోతిబాపూలే.. వైఎస్ఆర్.. గౌరవానికి పవన్ డిఫినేషన్.. జగన్ కు దిమ్మదిరిగిపోయే పంచ్

Pawan Kalyan- Jagan: జ్యోతిబాపూలే.. వైఎస్ఆర్.. గౌరవానికి పవన్ డిఫినేషన్.. జగన్ కు దిమ్మదిరిగిపోయే పంచ్

Pawan Kalyan- Jagan: పవన్ పంచ్ లు ప్రత్యర్థుల గుండెను తాకుతాయంటారు. పదునైన మాటలతో, సహేతుకమైన, సునిశితమైన చూపుతో ఆయన చేసిన కామెంట్స్ ప్రజలను ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు అనంతరం పవన్ అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీ సీఎం జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ నుంచి దిగువస్థాయి నేతల వరకూ నిత్యం బీసీ జపం పఠిస్తుంటారు. అణగారిన వర్గాల వారికి వైసీపీ సర్కారు చేసినంతగా దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెబుతుంటారు. 55 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసినట్టు ప్రకటిస్తుంటారు. ఆ మధ్యన జయహో బీసీ గర్జన అంటూ విజయవాడలో భారీ పొలిటికల్ మీటింగ్ ఏర్పాటుచేశారు. గత ఎన్నికల్లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కూడా వారి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవ న్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan- Jagan
Pawan Kalyan

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన పవన్ పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అణగారిన వర్గాల పరిస్థితి, వారి అభ్యున్నతికి పాటుపడిన నాయకులకు దక్కుతున్న గౌరవం గురించి మాట్లాడారు. ‘జనసేన కార్యాలయానికి వస్తూ మార్గ మధ్యలో ఆత్మకూరు అనే గ్రామం వద్ద వింత పరిస్థితిని చూశాను. గ్రామ ముఖ ద్వారంపై జ్యోతి బాపూలే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని రాసి ఉంది. సునిశితంగా గమనిస్తే కానీ అది కనిపించదు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్టు మభ్యపెట్టి మధ్యలో ఆ పేరు ఏంటి? సమాజంపై ఏం రుద్దాలని చూస్తున్నారు’ అంటూ పవన్ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక మంచి నాయకుడు. అనుభవమున్న నేత, ప్రజలకు ఎన్నో చేశారు. అంతవరకూ ఒకే కానీ ఆ మహనీయుల సరసన పేర్ల చేర్చడం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో మహనీయులకు గౌరవం ఇచ్చే సంస్కృతి గాడిలో తప్పింది. ఎంతవరకూ మీకు, మీ కుటుంబసభ్యులకు గౌరవాలేనా అని పవన్ ప్రశ్నించారు. అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి ఆ మహనీయులు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.

Pawan Kalyan- Jagan
Pawan Kalyan- Jagan

వారి గౌరవం అలానే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. గౌరవం అనేది ఇలా అరకొరగా ఇస్తే చాలదంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురు గార్లతో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పోల్చే స్థాయి కాదు అంటూ తేల్చేశారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కామెంట్స్ కు ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. జగన్ సర్కారు బీసీ జపం పఠిస్తున్న తరుణంలో పవన్ వ్యాఖ్యలు వారికి షాక్ నిచ్చినట్టయ్యాయి. సహజంగా పవన్ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వచ్చిన మరుక్షణమే వైసీపీ బ్యాచ్ ఎదురుదాడి ప్రారంభిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు, ఐ ప్యాక్ సూచనలు ఇంకా రానుట్టున్నాయి. అందుకే వారు సైలెంట్ గా ఉన్నారు. ఒకటి రెండు గంటల్లో దీనిపై అటాక్ ప్రారంభమవుతుందని జనసేనవర్గాలు భావిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular