Junior NTR- Hrithik Roshan: గత కొంతకాలం క్రితమే ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్ 2’ రాబోతుంది అనే వార్త సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2019 వ సంవత్సరం లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వార్’ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే.అప్పట్లోనే ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే సౌత్ మార్కెట్ లో పాగా వేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పాత్రలను మహాభారతం లోని శ్రీ కృష్ణుడు మరియు అర్జునుడు పాత్రలను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారట.
కృష్ణుడి ని ఆధారంగా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ పాత్రని, అలాగే అర్జునిడిని ఆధారంగా తీసుకొని హృతిక్ రోషన్ పాత్రని రూపించాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. అంటే ఎన్టీఆర్ వ్యూహకర్తగా, అలాగే హృతిక్ రోషన్ ఆ వ్యూహాలను అనుసరిస్తూ యుద్ధం లో పోరాడే వీరుడిగా కనిపించబోతున్నారు అన్నమాట. ఈ ప్లాన్ అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని చెప్పొచ్చు.
పైగా యాక్షన్ మూవీస్ అంటే బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో, అలాగే టాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ఉంటుంది.ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో తోడు అయితే సౌత్ ఇండియన్ మార్కెట్ లో కూడా హృతిక్ రోషన్ పాగా వెయ్యొచ్చు. వార్ సిరీస్ మొదటి భాగానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, రెండవ భాగానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గత ఏడాది రణబీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర అనే సినిమా తీసాడు.