UP Juice Vendor: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. జంక్ ఫుడ్ తినడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. రోజు వారీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆయిల్‌తో చేసిన ఆహారం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంని అంటున్నారు. పొట్టకు హాని చేస్తాయని చెబుతున్నారు. పొట్ట ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక కరోనా సమయం నుంచి చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బయటి ఫుడ్ చాలా వరకు తగ్గించారు. బయట తినాలంటే ఫ్రూట్స్, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటున్నారు. డ్రైఫ్రూట్స్ డెయిలీ డైట్‌లో భాగంగా మార్చుకున్నారు. వ్యాధుల బారిన పడ్డాక బాధపడడం కన్నా.. రాకుండా చూసుకోవడమే మేలని భావిస్తున్నారు. అయితే కొంత మంది వ్యాపారుల వికృత చేష్టల కారణంగా ఆహారం తీసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహార పదార్థాల తయారీ సమయంలో కనీస శుభ్రత పాటించడం లేదు. అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పండ్లు, పండ్ల రసాల సమయంలోనూ వ్యాపారుల వికృత చేష్టలు రోత పుట్టిస్తున్నాయి.
మూత్ర విసర్జన చేసి..
యూపీకి చెందిన ఓ పండ్ల వ్యాపారి మూత్ర విసర్జన చేసిన చేతులతోనే పండ్లు విక్రయించాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూరిన్ పాస్ చేశాక చేతులు కడుక్కోవాలన్న కనీస ఆలోచన లేకుండానే వ్యాపారం చేస్తున్నాడు. ఇక యూపీలోని షామ్లీ ప్రాంతానికి చెందిన ఓ పండ్ల రసాల తయారీదారు.. అయితే మరీ దారుణంగా చేస్తున్నాడు. తయారు చేస్తున్న పండ్లలో ఉమ్మి వేస్తున్నాడు. దానినే కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. వీటికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. వ్యాపారి చేసిన పనిని గుర్తించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు.
ఏం తినాలన్నా భయమే..
ఇక బయట ఏం తినాలన్న భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా సమయంలో కొంత మంది వ్యాపారులు పండన్లు డ్రెయినేజీ నీటిలో శుభ్రం చేసిన వీడియోలు వచ్చాయి. ఇక పండ్లు తాజాగా కనిపించేందుకు కలర్స్ పూయడం చూశాం. వాటర్ మిలన్ లాంటి పండ్లలో అయితే సిరంజ్ సహాయంతో కలర్ ఫిల్ చేయడం చూశాం. ఇప్పుడు జూస్‌ల తయారీ సమయంలోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జంక్ ఫుడ్‌తో ఆరోగ్య పాడవుతుందని భయపడేవారు పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటున్నారు. కానీ, వ్యాపారుల వికృత చేష్టల కారణంగా బయట ఏం తినాలన్నా అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది.