Garikipati Narasimha Rao: కల్కి’పై గరికపాటి గర్రుగుర్రు.. పురాణాలు వక్రీకరించారని సెటైర్!

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నర్సింహారావు. మంచి వాక్‌ చాతుర్యంతో ఆయన చేసే ప్రవచనాలు చాలా మంది వింటారు. కానీ, అప్పడప్పుడు సినిమా విషయాల్లో జోక్యం చేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 24, 2024 11:48 am

Garikipati Narasimha Rao

Follow us on

Garikipati Narasimha Rao: వాక్‌ చాతుర్యంతో చేసే.. ప్రవచనాలు కులం, మతంతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. మోటివేట్‌ చేస్తాయి. అలాంటి ప్రవచన కర్తల్లో మన గరికపాటి నర్సింహారావు ఒకరు. వ్యంగ్యంగా మాట్లాడుతూ వాస్తవాలను తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. సినిమాలపైనా ఆయన స్పందిస్తూ సెటైర్లు వేస్తుంటారు. గతంలో పుష్ప సినిమాపై విమర్శలు చేశారు. తర్వాత ఓ సినిమా ఫంక్షన్‌లో మెగా స్టార్‌ చిరంజీవిపైనే విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా గరికపాటి ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌తో తెరకెక్కిన మెగా హిట్‌ సినిమా కల్కి 2898 ఏడీని ఏకిపారేశారు. భారతంలో ఉన్నది వేరే.. సినిమా తీసింది వేరే అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఆయన కల్కిపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గరికపాటి ఏమన్నారంటే..
ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ కల్కి జూన్‌ 27న విడుదలైంది. బ్యాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఆస్కార్‌ నామినేషన్‌ బరిలో నిలిచింది. వైవిధ్య భరితమైన బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా తెరకెక్కించారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను వేరే యూనివర్స్‌కు తీసుకెళ్లింది సినిమా. ప్రధాన పాత్ర అశ్వద్ధామ పాత్రధారి అమితాబ్‌ బచ్చన్‌. అయితే ప్రభాస్‌ చరిష్మాతో సినిమా భారీగా ఓపెనింగ్స్‌ రాబట్టింది. కమలాసన్, దీపికా పదుకునె, శోభన, పశుపతి, దిశా పటానీ తదితరులు కూడా ఉండడంతో పాన్‌ ఇండియా సినిమాగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చివరల్లో కురుక్షేత్రం ఎపిసోడ్స్‌ గూస్‌ బంప్స్‌ తెప్పించాయి. అయితే సినిమా విడుదలైన ఇంత క ఆలానికి గరికపాటి స్పందించారు. విమర్శలు చేసి మల్లీ సినిమాను వార్తల్లోకి తెచ్చారు.

పురాణాలను వక్రీకరించారు..
తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. ఈ సందర్భంగా లక్కి గురించి ప్రస్తావించారు. మహాభారంతో ఉన్నది వేరు.. సినిమాలో చూపించింది వేరు అని పేర్కొన్నారు. అశ్వద్ధామ, కరుణడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని సెటైర్లు వేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన హీరోనే కర్ణుడు అనుకుంటారని పేర్కొన్నారు. అశ్వద్థామ, కర్ణుడు హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ వినల్లు అయిపోయారు. భారతంలో కర్ణుడినే అశ్వద్థామ కాపాడాడు.. కన్ణుడు అశ్వద్థామను కాపాడిన చరిత్ర లేదు అని తెలిపారు. అశ్వద్ధామ మహా వీరుడని, ఇక్కడేమో ఆచార్య పుత్రా ఆలస్యమైంది అని డైలాగ్‌ పెట్టారని విమర్శించారు.

స్పందిస్తున్న నెటిజన్లు..
ఇదిలా ఉంటే.. గరికపాటి కామెంట్స్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. గగతంలో వచ్చిన పౌరానిక గాధలు సైతం వాస్తవికతకు దూరంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా సినిమా తీశారని పేర్కొంటున్నారు. సినిమాను సినిమాలాగానే చూడాలంటున్నారు. సినిమాటిక్‌ లిబర్టీని వాడారని చెబుతున్నారు.