Howrah Bridge: హౌరా బ్రిడ్జి గురించి ఈ విషయాలు తెలుసా.. ప్రతీ రోజు 12 గంటలకు క్లోజ్‌.. మూసివేత వెనుక కథ ఇదీ..

భారత దేశంలోని మెట్రో నగరాల్లో కోల్‌కత్తా ఒకటి. పురాతన నగరమైన కోల్‌కత్తా అనేక చారిత్రక కట్టడాలకు నిలయం. ఇక్కడి ఒక్కో నిర్మాణం వెనుక ఒక్కో కథ ఉంటుంది. భారత్‌ను పాలించిన బ్రిటిషర్లు దీనిని ప్రధాన నగరంగా వాడుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 24, 2024 11:37 am

Howrah Bridge

Follow us on

Howrah Bridge: ఏౌఠీట్చజి ఆటజీఛీజ్ఛ ఊ్చఛ్టి: కోల్‌కతా భారత దేశంలో అతి పురాతన నగరం. బ్రిటిషర్లు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు, రవాణా కోసం కోల్‌కతాను అనువుగా భావించారు. స్వాతంత్య్రానికి పూర్వం భారత దేశానికి కోల్‌కతా రాజధానిగా ఉండేది. బ్రిటిష్‌కు పూర్వ పాలించిన వారు, బ్రిటిష్‌ పాలకులు కోల్‌కత్తాలో అనేక కట్టడాలు నిర్మించారు. అందులో అతి పురాతనమైన హౌరా బ్రిడ్జి ఒకటి. ఈ బ్రిడ్జి అందరికీ తెలిసినా.. చాలా మందికి దాని ప్రత్యేకతలు తెలియదు. హౌరా బ్రిడ్జిని 1870లో నిర్మించాలని బ్రిటిషర్లు నిర్మించారు. బ్రిటన్‌ నుంచి కోల్‌కత్తా రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, హుగ్లీ నది దాటడం బ్రిటిషర్లకు కష్టంగా ఉండేది. ఈ క్రమంలోనే కోల్‌కతా పాలకులతో చర్చించి హుగ్లీ నదిపై వంతెన నిర్మించడానికి ఒప్పించారు. దీని కోసం బ్రిటన్‌ నుంచే స్టీల్‌ తీసుకువచ్చారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలోనే తుపాను రావడంతో వంతెన కొట్టుకుపోయింది. అయినా బ్రిటిష్‌ పాలకులు తర్వాత మళ్లీ కొత్తగా నిర్మించారు. పూర్తిగా స్టీల్‌తోనే దీనిని నిర్మించారు.

1900లో ఎరిగిన రద్దీ..
ఇదిలా ఉంటే.. వంతెనపై రద్దీ క్రమంగా పెరిగింది. దీంతో వంతెనను విస్తరించారు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కొత్త వంతెన నిర్మించారు. అయితే యుద్ధం కారణంగా వంతెన నిర్మాణం ఆలస్యమైంది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి నిర్మాణం పూర్తయింది. దీని కోసం బ్రిటన్‌ నుంచి 3 వేల టన్నుల స్టీల్‌ తీసుకురాగా 23 వేల టన్నుల స్టీల్‌ను టాటా కంపెనీ ఉత్పత్తి చేసింది. మొత్త 26 వేల టన్నుల స్టీల్‌లో కేవలం రూ.22 లక్షలతో వంతెన నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జిని పేల్చివేయాలని అప్పట్లో జపాన్‌ ప్రయత్నించింది. దీంతో దీనిని అధికారికంగా ప్రారంభించలేదు. నిత్యం లక్షల మంది దీనిమీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. పైన రోడ్డు, కింద రైలు వెళ్లేలా దీనిని నిర్మించారు. దీనికి అమర్చిన లైటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది.

12 గంటలకు ముసివేత..
ఇక ఈ హౌరా బ్రిడ్జిని ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అర్ధరాత్రి 12 గంటలకు మూసివేస్తారు. నిత్యం లక్షల వాహనాలు వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తాయి. పురాతన వంతెన కావడంతో దీనిపై అధిక లోడ్‌ పడుతుంది. ఈ నేపథ్యంలో విరామం ఇవ్వడం వలన వంతెన కూలిపోయే ప్రమాదం లేకుండా ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. కేవలం రెండు స్తంభాలపై ఉన్న వంతెన నిర్వహణకు ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా స్టీల్‌ తుప్పు పడుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం, అర్ధరాత్రి విశ్రాంతి ఇవ్వడం ద్వారా ప్రమాదం జరుగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఇక పిల్లర్లు పడిపోతే 12 గంటలకే పడిపోతాయని వంతెన నిర్మించిన ఇంజినీర్లు చెప్పారట. అందుకే 12 గంటల సమయంలో వంతెనకు విశ్రాంతి ఇస్తున్నారు.