https://oktelugu.com/

Hrithik Roshan- NTR: ‘వార్ 2 ‘ లో జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో యుద్దానికి సై!

Hrithik Roshan- NTR: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మామూలు రేంజ్ లో లేదు.ప్రస్తుతం కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ‘వార్ 2’ నటించబోతున్నట్టు ఈరోజు అధికారికంగా ఒక వార్త వచ్చింది.2019 వ సంవత్సరం లో హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వార్’ అనే చిత్రం ఎంత […]

Written By:
  • Vicky
  • , Updated On : April 5, 2023 / 12:06 PM IST
    Follow us on

    Hrithik Roshan- NTR

    Hrithik Roshan- NTR: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మామూలు రేంజ్ లో లేదు.ప్రస్తుతం కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ‘వార్ 2’ నటించబోతున్నట్టు ఈరోజు అధికారికంగా ఒక వార్త వచ్చింది.2019 వ సంవత్సరం లో హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వార్’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

    అప్పట్లో ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 350 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హృతిక్ రోషన్ కి గ్రాండ్ కం బ్యాక్ గా నిల్చింది ఈ సినిమా.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘వార్ 2 ‘ ఈ ఏడాది నుండి సెట్స్ మీదకి వెళ్లనుంది.

    బ్రహ్మాస్త్ర సినిమాకి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.ఇందులో హృతిక్ రోషన్ ది పాజిటివ్ రోల్, ఇక జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ అవ్వొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.ఒకవేళ #RRR లాగ ఇద్దరిది పాజిటివ్ రోల్ అయ్యే అవకాశం కూడా ఉంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

    Hrithik Roshan- NTR

    ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేస్తే అభిమానులు తీసుకోగలరా..?,పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఫ్యాన్స్ కూడా సర్దుకుపోయ్యే అవకాశం ఉంది.వీటి అన్నిటికి మించి జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ గొప్ప డ్యాన్సర్లు.వీళ్లిద్దరు కలిసి ఒకే తెరపై కనిపించి స్టెప్పులేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ స్మాష్ అవ్వడం పక్కా.ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.