
Pushpa 2 Glimpse – Pawan : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ ప్రీ టీజర్ నేడు విడుదలైంది.ఏప్రిల్ 7 వ తారీఖున ఈ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పూర్తి టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.2021 వ సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఈ సినిమా.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి సీక్వెల్ కాబట్టే ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టు గానే, పార్ట్ 1 కి మించి పది రేట్లు గొప్పగా ఉండేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట సుకుమార్.ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదల చేసిన ప్రీ టీజర్ లో అభిమానులెవ్వరూ గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

ఈ ప్రీ టీజర్ ప్రారంభం లోనే మనం రెండు విషయాలను గమించొచ్చు.ఒకటి గోడ మీద వేసున్న మెగాస్టార్ చిరంజీవి పెయింటింగ్, దాని పక్కనే ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మూవీ కటౌట్, దానికి ఎడమ వైపు ఉన్న ప్రభాస్ వర్షం మూవీ బ్యానర్.ఈ ప్రీ టీజర్ ప్రారంభం లోనే 2004 వ సంవత్సరం తిరుపతి అని ఉంటుంది.2004 వ సంవత్సరం లోనే మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా MBBS’ మరియు పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ సినిమాలు ఒక నెల గ్యాప్ లో విడుదలయ్యాయి.
సుకుమార్ డిటైలింగ్ కి ఎంత అద్భుతంగా ఉందో చూడండి.మరో పక్క జైలు నుండి అల్లు అర్జున్ తప్పించుకుంటున్న షాట్ ని కూడా ఈ ప్రీ టీజర్ లో గమనించొచ్చు.రాజకీయ నేపథ్యం కూడా ఈ సినిమాలో బలంగానే ఉన్నట్టుండి.ప్రీ టీజర్ తోనే ఇంత ఆసక్తి కలిగిస్తే ఇక మెయిన్ టీజర్ తో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.