Jobs: ఒత్తిడి లేకుండా దర్జాగా సంపాదించుకునే ఉద్యోగాలివే..

ఐటీ పరిశ్రమలో టెక్నికల్ రైటింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. క్లిష్టమైన సాంకేతిక విషయాల కోసం డాక్యుమెంటేషన్, బోధనా సామగ్రి సృష్టించడం టెక్నికల్ రైటింగ్ ప్రధాన విధి.

Written By: Suresh, Updated On : February 21, 2024 11:34 am
Follow us on

Jobs: ఒత్తిడి.. ఊపిరి సలపని పని ఒత్తిడి.. తలబద్దలయ్యే టెన్షన్.. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఆందోళన. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య ఉద్యోగం అనేది ఎంతటి వారి కైనా ఒక సవాలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందోనన్న భయమే ఎక్కువ. పైగా కార్పొరేట్ కంపెనీలు లే – ఆఫ్ పేరుతో అడ్డగోలుగా టెకీలను తొలగిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఒత్తిడి లేకుండా.. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని సంపాదించే ఉద్యోగా గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

వెబ్ డెవలపర్

వెబ్ సైట్ రూప కల్పనలో వెబ్ డెవలపర్ ల దే కీలక పాత్ర.. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వెబ్ డెవలపర్ లకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విభాగంలో అధిక చెల్లింపులు ఉంటాయి. కోడింగ్ ను అస్వాధించే వ్యక్తులకు వెబ్ డెవలపర్ ఉద్యోగం సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇందులో తక్కువ ఒత్తిడి ఉంటుంది.

టెక్నికల్ రైటింగ్

ఐటీ పరిశ్రమలో టెక్నికల్ రైటింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. క్లిష్టమైన సాంకేతిక విషయాల కోసం డాక్యుమెంటేషన్, బోధనా సామగ్రి సృష్టించడం టెక్నికల్ రైటింగ్ ప్రధాన విధి. నైపుణ్యం ఉండి నాణ్యంగా రాయడం, స్వతంత్రంగా ఉండాలనుకునే వ్యక్తులకు టెక్నికల్ రైటింగ్ మంచి అవకాశం. టెక్నికల్ రైటింగ్ విభాగంలో అపారమైన అవకాశాలున్నాయి. పని ఒత్తిడి తట్టుకోలేని వారికోసం ఇది ఉత్తమమైన ఉద్యోగం.

లైబ్రేరియన్

పుస్తకాల నిల్వ, సమాచార సేకరణ, విజ్ఞాన భాండాగారాల భద్రత, విలువైన సమాచార సేకరణ, వంటివి ఈ ఉద్యోగం ముఖ్య లక్షణాలు.. తక్కువ ఒత్తిడితో ప్రశాంతమైన వాతావరణంలో పని చేసుకునే వెసులుబాటు ఈ ఉద్యోగం లో ఉంటుంది.

డాటా ఎనలిస్ట్

సమాచారాన్ని గణాంకాల రూపంలో ఇవ్వటమే డాటా ఎనలిస్టు ఉద్యోగ లక్షణం. పలు ఐటీ సంస్థలు తమకు దక్కిన ప్రాజెక్టుల ఆధారంగా డాటా ఎనలిస్టులను నియమించుకుంటాయి. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా దాన్ని ప్రాసెస్ చేయడం డాటా ఎనలిస్టుల పని. డాటా ఎనలిస్టులకు ఎక్కువ పని ఒత్తిడి ఉండదు. జస్ట్ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం.. దానిని గణాంకాల రూపంలో ఇవ్వటమే వారి విధి. పేరుపొందిన ఐటీ కంపెనీలో డాటా ఎనలిస్టులకు భారీగా జీతాలు ఇస్తుంటాయి.

ఆన్ లైన్ ట్యుటర్

సాంకేతికత పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్ లైన్ ట్యుటర్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోవిడ్ సమయంలో ఆన్ లైన్ ట్యుటర్ లను పెద్ద పెద్ద సంస్థలు లక్షల్లో జీతాలు ఇచ్చి నియమించుకున్నాయి. ముఖ్యంగా స్టెమ్, భాషా బోధన వంటి రంగాలలో ట్యూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

(మాకందిన సమాచారం మేరకే ఈ ఉద్యోగాల గురించిన వివరాలు మీకు అందించాం. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇందులో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే నష్టం లేని వ్యాపారం ఉండదు. ఒత్తిడి లేని ఉద్యోగం ఉండదు)