Homeట్రెండింగ్ న్యూస్Jeff Bezos Lauren Sanchez Wedding: అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ వివాహం.. ఎన్ని...

Jeff Bezos Lauren Sanchez Wedding: అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ వివాహం.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?

Jeff Bezos Lauren Sanchez Wedding: అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరులలో ఒకడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకున్నాడు.. లారెన్ సాంచెజ్ చేతికి ఉంగరం తొడిగి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు.. ఇటలీలోని వెనిస్ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకను అమెజాన్ వ్యవస్థాపకుడు రోజులపాటు జరుపుకున్నాడు. ఈ వేడుకకు అమెజాన్ వ్యవస్థాపకుడి సహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు..

Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!

ఇక ఈ వివాహాన్ని “వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీగా” గా పేర్కొంటున్నారు.. అమెజాన్ వ్యవస్థాపకుడి వివాహానికి ప్రముఖ టీవీ హోస్ట్ కర్దాషియన్ హాజరయ్యారు. అమెరికా మోడల్ కెండల్ జెన్నర్, కైలి జెన్నర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సారా స్టౌడింగర్, అమెరికన్ జర్నలిస్ట్ గేల్ కింగ్, యూఎస్ టాక్ షో హోస్ట్ ఓఫ్రా విన్ ప్రే ఇంకా ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. బెజోస్ కు గతంలోనే వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు అప్పట్లో తన మొదటి భార్యకు భారీగానే భరణం ఇచ్చినట్టు తెలుస్తోంది. లారెన్ తో కొద్దిరోజులుగా బెజోస్ సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. దీంతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

రోజులపాటు వేడుక

వెనిస్ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రపంచ స్థాయి వ్యక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో పాప్ సింగర్లు పాటలు పాడారు. ర్యాపర్లు డాన్సులు వేశారు. ఈ వేడుక రోజులపాటు నిర్వహించారు. ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా సంబరాలు జరిపారు. వీటికోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఇక వచ్చిన అతిధుల కోసం మెక్సికన్, ఇటాలియన్, ఫ్రెంచ్, అమెరికన్, జపనీస్, థాయ్ వంటకాలను వడ్డించారు. ఈ వంటకాలను తయారు చేయడానికి పాకశాస్త్ర నిపుణులను పిలిపించారు.. వంటకాలతో పాటు ఖరీదైన వైన్, ఇతర డ్రింక్స్ సర్వ్ చేశారు. వివాహ వేడుక వద్దకు అతిధులు ప్రత్యేకమైన పడవలో వచ్చారు. వివాహ వేడుకకు హాజరైన వారంతా డ్రెస్ కోడ్ తో కనిపించారు.. మహిళలు ఖరీదైన వస్త్రాలలో మెరిశారు. పురుషులు బ్లాక్ అండ్ వైట్ సూట్ లలో దర్శనమిచ్చారు.. వెస్ట్రన్ మీడియా నివేదిక ప్రకారం.. ఈ వివాహ వేడుకకు అమెజాన్ వ్యవస్థాపకుడు వేలకోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.. ఇంకా కొంతమంది అతిధులు గైర్హాజరైన నేపథ్యంలో.. వారికోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.. మొత్తంగా చూస్తే నీటిపై తేలియాడే వెనీస్ నగరంలో అమెజాన్ వ్యవస్థాపకుడు తన జీవితంలో గుర్తుండిపోయే విధంగా వివాహ వేడుకను చేసుకున్నాడని వెస్ట్రన్ మీడియా తన కథనాలలో పేర్కొంది. వెస్ట్రన్ మీడియా కథనాల ప్రకారం అమెజాన్ వ్యవస్థాపకుడు తన వివాహ వేడుక కోసం దాదాపు పది మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular