Manchu Vishnu Movie Critics: సినిమాలు విడుదలైన రోజు రివ్యూస్ రావడం సహజం. ముఖ్యంగా పేరు మోసిన రివ్యూయర్స్ ఒక సినిమాకు రివ్యూ చెప్పకుండా ఆపడం ఎవరి తరం కాదు. ఎంత పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో సినిమాకి అయినా రివ్యూ చెప్పాల్సిందే. కానీ నిన్న విడుదలైన మంచు విష్ణు ‘కన్నప్ప'(Kannappa Movie) మూవీ రివ్యూస్ ఇప్పటి వరకు సోషల్ మీడియా లో పేరు మోసిన క్రిటిక్స్ ఎవ్వరూ కూడా రివ్యూస్ చెప్పకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ రేంజ్ లో వాళ్ళను కట్టడి చేయడం దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో టాప్ చైర్ లో కొనసాగుతున్న మెగా మరియు నందమూరి హీరోలకు కూడా సాధ్యం కాలేదు, మంచు విష్ణు(Manchu Vishnu) కి ఎలా సాధ్యపడింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియా అకౌంట్స్ ని డీ యాక్టీవేట్ చేసుకొని వెళ్లిపోయారు.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
ఇలా ముఖ్యమైన క్రిటిక్స్ నుండి ఎలాంటి రివ్యూస్ రాకపోవడం వల్ల ఈ సినిమా టాక్ ఏంటో జనాల్లోకి బలంగా వెళ్ళలేదు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ కి అయితే హైదరాబాద్ వంటి సిటీస్ లో అయితే టికెట్ ముక్క దొరికితే ఒట్టు అన్న విధంగా తయారైంది పరిస్థితి. కానీ ఆన్లైన్ రివ్యూస్ ని ఆపొచ్చేమో కానీ, పబ్లిక్ లో ఉండే నిజమైన టాక్ ని మాత్రం మార్చడం ఎవరి వల్ల కాదు. బుక్ మై షో యాప్ లో వచ్చే రేటింగ్స్ ని పబ్లిక్ టాక్ తో సమానంగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం సినిమాని చూసిన వాళ్ళు మాత్రమే రివ్యూ ఇవ్వగలరు. ఆ విధంగా చూస్తే ఈ చిత్రానికి కేవలం 10 కి 7.4 రేటింగ్స్ మాత్రమే వచ్చింది.
విడుదల రోజు 8 కంటే తక్కువ రేటింగ్స్ రావడం ఒక సినిమాకి మంచిది కాదు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ చిత్రానికి పబ్లిక్ లో పాజిటివ్ టాక్ లేదు అనేది. మెయిన్ క్రిటిక్స్ ఈ చిత్రానికి రివ్యూస్ ఇవ్వడం మొదలు పెడితే కచ్చితంగా దారుణమైన పరిస్థితి ఉండేది అని,మంచు విష్ణు తెలివితేటలతో తన సినిమాని కాపాడుకున్నాడని, టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతలంతా ఎలా క్రిటిక్స్ ని కంట్రోల్ చేయగలిగాడో టెక్నీక్స్ ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇతర నిర్మాతలు కూడా ఈ రేంజ్ లో కట్టడి చేయగలిగితే సినిమా ఇండస్ట్రీ ని కాపాడినట్టే అనుకోవచ్చు. మంచు విష్ణు ని సోషల్ మీడియా లో అందరూ ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆయనే కరెక్ట్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.