JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు వచ్చాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్ల కోసం గత నెల 28న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ ముంబై విడుదల చేసింది. ఈ ఫలితాల్లో విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించాడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై జేఈఈ అడ్వాన్స్ డ్ 2022 ఫలితాలు ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్ డ్ అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బాలికలకు 1567 సీట్లను సూపర్ న్యూమరరీ లెక్కన కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లను కలిపితే అది 14 శాతం పెరగడం గమనార్హం. ఈ పరీక్షకు ఈ ఏడాది మొత్తం 1,60,038 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1,55,538 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 40,712 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఐఐటీ బాంబే జోన్ కు చెందిన ఆర్కే శిశిర్ ఆల్ ఇండియా టాపర్ గా నిలవడం గమనార్హం. 360 మార్కులకు గాను 314 మార్కులు సాదించిన శిశిర్ కు మొదటి స్థానం దక్కింది. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన తనిష్క కబ్రా మహిళల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. 360 మార్కులకు గాను 277 మార్కులు సాధించి ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది.

రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు లభించనున్నాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఏఫ్టీఐలలో 6,759 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా అమలు చేయనున్నారు. అర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి అభ్యర్థులు 11,12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 14న ఏఏటీ పరీక్ష నిర్వహించి 17న ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. https:/result.jeedv.ac.in/ లో క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో మన హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఇరవై ర్యాంకుల్లో మనవారు ఐదు ర్యాంకులు సొంతం చేసుకోవడం విశేషం. ఆకాష్ రెడ్డి నాలుగో ర్యాంకు, కార్తికేయ ఐదో ర్యాంకు, త్రివేశ్ చంద్ర ఎనిమిదో ర్యాంకు, జి.వి.కృష్ణ, సూర్య లిఖిత్ 13వ ర్యాంకులు సాధించి తెలుగు వారి ఖ్యాతి మరోసారి చాటారు.