Homeఎంటర్టైన్మెంట్Krishnam Raju- SP Balu: నాడు ఎస్పీ బాలు.. నేడు కృష్ణంరాజు.. అచ్చం అలాగే కబళించిన...

Krishnam Raju- SP Balu: నాడు ఎస్పీ బాలు.. నేడు కృష్ణంరాజు.. అచ్చం అలాగే కబళించిన ‘కరోనా’

Krishnam Raju- SP Balu: ఎస్పీ బాలు.. దేశం గర్వించే గాయకుడిని ఆ కరోనా బలి తీసుకుంది. కరోనా కల్లోలంలో ఎస్పీ బాలు ఓ పాటల వేడుకలో పాల్గొని ఆ మహమ్మారిని అంటించుకున్నారు. అయితే కరోనా తగ్గినా ఆ మందులు, దాని సైడ్ ఎఫెక్ట్ తో బాలు ప్రాణాలు తీసింది. బాలు ఊపిరి తిత్తులు చెడిపోయి ఆయన మృత్యుముఖం చూడాల్సి వచ్చింది. కరోనా తగ్గినా కూడా దాని నుంచి ఎదురయ్యే దుష్ఫలితాల వల్లే చాలా మంది చనిపోయారు. బాలు కూడా అలానే చనిపోయారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఇక లావుగా ఉండడం.. ఉబకాయం.. 60 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ తీవ్రంగా ఉంటుంది. అది తగ్గినా అవయవాలను దెబ్బతీసి ప్రాణాలు తీసింది.. నాడు ఎస్పీ బాలుకు అదే జరిగింది. నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అదే పెను శాపమైంది.

అచ్చం ఎస్పీ బాలు తరహాలోనే నెలరోజులుగా కృష్ణంరాజు కరోనా బారినపడ్డారు. అనంతరం దాని సైడ్ ఎఫెక్ట్ లతో న్యూమోనియా, మధుమేహం, గుండె వేగం తగ్గి మరణించారు. ఈ మేరకు కృష్ణంరాజు చికిత్స పొందిన ఏఐజీ ఆస్పత్రి ఈ విషయాన్ని పేర్కొంది. కృ ష్ణం రాజు 83 ఏళ్ల వయసు కావడంతో కరోనాను ఆయన శరీరం తట్టుకోకపోలేకపోయింది. వృద్ధాప్యం శాపమైంది. కృష్ణంరాజుకు డయాబెటిస్ (షుగర్) వ్యాధి ఉంది. కరోనరీ హార్ట్ డిసీజ్, క్రానిక్ హార్ట్ రిథమ్ డిజార్డర్, హార్ట్ డిస్‌ఫంక్షన్‌తో పోస్ట్ కార్డియాక్ స్టెంటింగ్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయనకు చికిత్స అందించిన ఏఐజీ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం బాత్రూంలో కాలుజారి పడిపోవడంతో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా కాలుకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇక కృష్ణంరాజుకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి- నెబ్యులైజ్డ్ ఇన్హేలర్లపై క్రానిక్ బ్రోన్కైటిస్ ఉన్నాయని వైద్యులు ఆయన మరణానికి కారణాలపై ప్రకటన విడుదల చేశారు.

Also Read: Krishnam Raju Anushka: కృష్ణంరాజుతో చివరి క్షణాన ఆస్పత్రిలో అనుష్క.. ప్రభాస్ తో సంబంధం లేదన్నారు..? వైరల్ వీడియో

Krishnam Raju- SP Balu
SP Balu

కృష్ణంరాజు ఆగస్టు 5న కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ అయిన సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరాడు. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ తో తీవ్రమైన న్యుమోనియా, తీవ్రమైన ఇన్ఫెక్టివ్ బ్రోన్కైటిస్‌తో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుండె కొట్టుకోవడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. మూత్రపిండాల పనితీరు మరింత దిగజారింది. అడ్మిట్ అయినప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారు. పల్మోనాలజీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, వాస్కులర్ సర్జరీ విభాగాల నుండి నిపుణుల బృందం కృష్ణంరాజుకు చికిత్స అందించినా కరోనా సైడ్ ఎఫెక్ట్ తో ఆయన అవయవాలపై ప్రభావం పడి శరీరం స్పందించలేదు. ఈరోజు తెల్లవారుజామున తీవ్రమైన న్యుమోనియా, దాని సమస్యలతో మరణించాడు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తెల్లవారుజామున 3.16 గంటలకు తుదిశ్వాస విడిచాడు.

ఎస్పీ బాలుకు, కృష్ణంరాజుకు ఒకటే లక్షణాలు కనిపించాయి. ఇద్దరినీ కరోనానే బలి తీసుకుంది. కరోనా విషయంలో 60 ఏళ్లు దాటిన వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఈ పరిణామాలు రుజువుచేస్తున్నాయి. సెలబ్రెటీలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

Also Read:Krishnam Raju- Prabhas Marriage: కృష్ణంరాజు కోరినా ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు.? ఆయన చివరి కోరిక ఎందుకు తీర్చలేదు?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version