Janasena cycles : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా యూత్ , మాస్ ఆడియన్స్ లో ఆయన ఫ్యాన్ బేస్ మరో హీరోకి కలలో కూడా ఊహించలేనిది..ఆయనకీ సంబంధించిన ఏ విషయమైనా అభిమానులకు ఆరాధ్యం లాంటిది..అందుకే మార్కెట్ లో అతని క్రేజ్ ని వాడుకొని డబ్బులు చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు..పవన్ కళ్యాణ్ వాడిన దుస్తులు అని ఆన్లైన్ లో పెడితే నిమిషాల్లోనే అమ్ముడుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇప్పుడు మార్కెట్ లోకి లేటెస్ట్ గా జనసేన పెయింటింగ్ వేసిన సైకిల్స్ కి మామూలు డిమాండ్ లేదు..ఇటీవలే నెల్లూరు సిటీ లో ఒక సైకిల్ షాప్ లో జనసేన పార్టీ లోగోలతో కొన్ని సైకిల్స్ దర్శనమిచ్చాయి..ఆ సైకిల్స్ ఈరోజు స్టాక్ లోకి వచ్చినంత సమయం కూడా పట్టలేదు అవి అమ్ముడుపోవడానికి.. ఇది సాధారణమైన క్రేజ్ కాదని ఆ షాప్ ఓనర్ ఆశ్చర్యపోతూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు త్వరలోనే ఈ సైకిల్స్ ఆన్లైన్ లో అందుబాటులోకి రానుంది అట..ఇక వీటికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..గతం లో కూడా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి సినిమాలో, ఆయన వేసుకున్న బ్రాండెడ్ గ్యాప్ టీ షర్ట్స్ ని ఆన్లైన్ లో సేల్స్ పెట్టారు..నిమిషాల వ్యవధిలోనే ఆ టీ షర్ట్స్ అన్నీ అమ్ముడుపోయాయి..రేపు ఈ సైకిల్స్ కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతుంది ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే..మరోపక్క డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయ్యింది..సుమారు 20 రోజుల పాటు ఇక్కడ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే భారీ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు.