Avatar: The Way of Water : అవతార్ 1.. అప్పుడెప్పుడో 2009లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. ఏంకగా 25 బిలియన్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
![]()
భూమికి ఆవల పండోర అనే సరికొత్త గ్రహం.. అందులోని వాతావరణం.. భూమి నుంచి మనుషులు వెళ్లి చేసే విధ్వంస కాండ ఇలా ఆ సరికొత్త ఊహా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కాసులు కురిపించింది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందులోని సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని గతంలోనే డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రకటించారు..
అయితే అవతార్ 2 సినిమాను తీసేందుకు 10 ఏళ్లు టైం పెట్టుకున్నాడు. ఎందుకంటే మొత్తం గ్రాఫిక్స్ తోనే దీన్ని తీయడం.. షూటింగ్ చేసేది చాలా తక్కువ. పైగా ఇందులో ప్రధాన పాత్రధారులు మనుషులు కాదు.. వేరే గ్రహం వ్యక్తులు.అందుకే అవతార్ 2 రావడానికి ఏకంగా పదేళ్లు తీసుకున్నాడు కామెరూన్. కానీ ఆ సమయం మరో మూడేళ్లు వాయిదా పడింది.
నిజానికి 2020లోనే అవతార్ 2 సినిమాను విడుదల చేయడానికి కామెరూన్ అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల చేయాలని అనుకున్ానరు. కానీ కరోనా కారణంగా రెండేళ్లు షూటింగ్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆలస్యం కావడంతో అనుకున్న టైంకు అవతార్2 సిద్ధం కాలేదు. దీంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సంవత్సరం డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ క్రిస్మస్ సెలవులు, న్యూయర్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ సరైన సమయంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
మరి 13 ఏళ్ల కామెరూన్ కష్టం తాజాగా అవతార్2 ట్రైలర్ లో కనిపించింది. సినిమా ఒక విజువల్ వండర్ అని అర్థమవుతోంది. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
